బిజినెస్

పెరిగిన బెంజ్, బిఎమ్‌డబ్ల్యు, జెఎల్‌ఆర్ అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ముంబయ, జూలై 9: దేశీయ మార్కెట్‌లో లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యుతోపాటు దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌కు చెందిన జెఎల్‌ఆర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయ. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బెంజ్ కార్ల విక్రయాలు రికార్డు స్థాయలో 18 శాతం పుంజుకుని 3,521 యూనిట్లుగా నమోదయ్యాయ. నిరుడు ఇదే వ్యవధిలో 2,975 యూనిట్లను అమ్మినట్లు సంస్థ తెలిపింది. జనవరి-జూన్‌లో కూడా 6,597 యూనిట్ల నుంచి 7,171 యూనిట్లకు పెరిగాయ. మరోవైపు బిఎమ్‌డబ్ల్యు అమ్మకాలు కూడా 11.5 శాతం ఎగిసి ఈ జనవరి-జూన్‌లో 4,589 యూనిట్లుగా ఉన్నాయ. కాగా, జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) విషయానికొస్తే.. గత నెల జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా సంస్థ అమ్మకాలు 11 శాతం పెరిగి 51,591 యూనిట్లుగా నమోదయ్యాయ. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనైతే 3.5 శాతం వృద్ధితో 1,37,463 యూనిట్లుగా ఉన్నాయ. చైనాలో అత్యధికంగా విక్రయాలు జరిగినట్లు సంస్థ తెలియజేసింది.