బిజినెస్

ఎమ్‌ఆర్‌పి ఒక్కటే చాలదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆన్‌లైన్‌లో కొనుగోళ్లను జరిపే వినియోగదారుల రక్షణలో భాగంగా చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ-కామర్స్ సంస్థలన్నీ అమ్మే వివిధ రకాల ఉత్పత్తులపై ఎమ్‌ఆర్‌పినేగాక, ఎక్స్‌పైరీ డేట్, కస్టమర్ కేర్ తదితర వివరాలన్నీ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ వస్తువులు) నిబంధనలు-2011 చట్టంలో గత నెలే వినియోగదారుల సంబంధాల మంత్రిత్వ శాఖ సవరణలు చేపట్టింది. అయితే కొత్త నిబంధనల అమలు కోసం ఆరు నెలల వ్యవధిని ఆన్‌లైన్ మార్కెటీర్లకు ఇచ్చింది. ‘ఆఫ్‌లైన్ (సంప్రదాయ మార్కెట్) మాదిరిగానే ఆన్‌లైన్ మార్కెట్‌లోనూ వినియోగదారుల రక్షణ ముఖ్యం. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అమ్ముడవుతున్న ఉత్పత్తులపై కేవలం ఎమ్‌ఆర్‌పి (గరిష్ఠ చిల్లర ధర)నే ఉంటోంది. అలాగాకుండా ఎమ్‌ఆర్‌పితోపాటు తయారీ తేది, ఎక్స్‌పైరీ తేదీ, దాని బరువు, అందులోని వస్తువుల సంఖ్య, అది ఎక్కడ తయారైంది, వినియోగదారుల భద్రతకు సంబంధించిన తదితర అన్ని వివరాలను ముద్రించాలి.’ అని వినియోగదారుల సంబంధాల మంత్రిత్వ శాఖకు చెంది న ఓ సీనియర్ అధికారి చెప్పారు. దేశీయంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, గ్రోఫర్స్, బిగ్‌బాస్కెట్ తదితర సంస్థలు ఆన్‌లైన్‌లో ఆయా రకాల ఉత్పత్తులను విక్రయిస్తున్నది తెలిసిందే. ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను నినాదంతో వచ్చిన జిఎస్‌టిలో 1,200లకుపైగా వస్తువులు, 500ల సేవలకు కలిపి నాలుగు శ్లాబుల్లో పన్ను రేట్లను నిర్ణయించారు. 5, 12, 18, 28 రేట్లలో ఈ పన్నులను వేయగా, బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం పన్నును విధించారు. విద్య, వైద్యం, తాజా కూరగాయలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు.