బిజినెస్

ద్రవ్యోల్బణం, ఐఐపి గణాంకాలు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) గణాంకాలతో పాటు ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను వివిధ సంస్థలు వెల్లడించే ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు ఎలా? ఉందన్న దానిపైనా మదుపరులు దృష్టి పెట్టవచ్చని, దాని ఆధారంగా కూడా ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి పెట్టుబడులను తీసుకువచ్చే వీలుందని నిపుణులు పేర్కొంటున్నారు.
కాగా, బుధవారం మే నెలకుగాను ఐఐపి గణాంకాలు విడుదలవుతుండగా, అదేరోజు జూన్ నెలకు గాను వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాల ప్రకటనా జరుగుతుంది. శుక్రవారం జూన్ నెల టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యుపి ఐ) గణాంకాలు వెల్లడి కానున్నాయ. మరోవైపు దేశీయ ఐటి రంగ దిగ్గజాలైన టిసిఎస్, ఇన్ఫోసిస్‌లు తమ ఆర్థిక ఫలితాలను ఈ వారమే విడుదల చేస్తున్నాయ.
గురువారం టిసిఎస్, శుక్రవారం ఇన్ఫోసిస్ ప్రకటిస్తున్నా య. దీంతో సాధారణంగానే మార్కెట్ కదలికలపై వీటి ప్రభావం ఉండనుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయంట్ గ్రూప్ అధిపతి వికె శర్మ అన్నారు.
కాగా, వర్ష సమాచారమూ కీలకమేనని చెబుతుండగా, శనివారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన పరోక్ష పన్నుల విధానం (జిఎస్‌టి) కూడా కీలకమేనని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ అధిపతి వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. 5, 12, 18, 28 శ్లాబుల్లో వివిధ రంగాలకు చెందిన దాదాపు అన్ని వస్తువులకు కేంద్రం.. జిఎస్‌టిలో పన్ను రేట్లను నిర్ణయంచినది తెలిసిందే. అయతే అధిక పన్ను విధించారన్న భావనలో ఉన్న పలు రంగాలు తమపై పన్నుల భారాన్ని తగ్గించాలని ఆందోళన బాట పట్టాయ. దీంతో వీటన్నిటి ప్రభావం మదుపరుల పెట్టుబడులపై ఉంటుందంటున్నారు మార్కెట్ విశే్లషకులు. అయతే ద్రవ్యోల్బణం, ఐఐపి గణాంకాలు మార్కెట్ ట్రేడింగ్‌ను అధికంగా ప్రభావితం చేస్తాయని ఆమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్స్ రిసెర్చ్ అధిపతి అభ్నిశ్ కుమార్ సుధాంశు అంటున్నారు. కాగా, గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 439.02 పాయంట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 144.90 పాయంట్లు పెరిగాయ.
సెనె్సక్స్ 31,360 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 9,665 వద్ద నిలిచింది. ఇదిలావుంటే ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.