బిజినెస్

అద్దెల ఆదాయంపైనా జిఎస్‌టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: అద్దెల నుంచి వచ్చే ఆదాయం ఏటా 20 లక్షల రూపాయలు దాటితే వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) చెల్లించాల్సిందే. అయితే రెసిడెన్షియల్ ప్రాపర్టీ (నివాస సముదాయం)లకు మినహాయింపు ఉంటుందని, కమర్షియల్ ప్రాపర్టీ (వాణిజ్య సముదాయం)లకు మాత్రమే ఇది వర్తిస్తుందని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. ‘మీ ఇల్లు లేదా ఫ్లాట్, అపార్ట్‌మెంట్ ఏదైనాసరే నివాసానికి ఇస్తే అద్దె రూపంలో దానిపై వచ్చే ఆదాయానికి జిఎస్‌టి చెల్లించనక్కర్లేదు. కానీ అదే ఇల్లు లేదా ఫ్లాట్, అపార్ట్‌మెంట్‌లను వాణిజ్య అవసరాలకు (షాప్ లేదా ఆఫీసు) ఇస్తే దానిపై వచ్చే అద్దె ఆదాయానికి జిఎస్‌టి చెల్లించాలి. అది కూడా ఏటా 20 లక్షల రూపాయలు మించితేనే.’ అని జిఎస్‌టి మాస్టర్ క్లాస్‌లో అధియా చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చినది తెలిసిందే.