బిజినెస్

కర్ణాటక పవర్ కార్పొరేషన్‌తో సింగరేణి ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూలై 10: తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కాలరీస్ బొగ్గుకు డిమాండ్ పెరుగుతోంది. సింగరేణి కాలరీస్ యాజమాన్యం నుంచి 81 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేసుకునేందుకు కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది. సింగరేణి కాలరీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ్ధర్, కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కెపిసిఎల్) ఎండి కుమార్ నాయక్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ థర్మ ల్ విద్యుత్ కేంద్రానికి 30 లక్షల టన్ను ల బొగ్గును, బళ్లారి థర్మల్ విద్యుత్ కేంద్రానికి 31 లక్షల టన్నులు, ఎర్రమారిస్‌లో నిర్మించిన మరో విద్యుత్ కేంద్రానికి 20 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయనుంది. ఈ సందర్భంగా సింగరేణి సిఎండి శ్రీ్ధర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని 660 లక్షల టన్నులకు పెంచుకుందన్నారు. అయితే ఈ ఏడాది సింగరేణి బొగ్గుకు 800 లక్షల టన్నుల డిమాండ్ వస్తోందన్నారు. కర్ణాటక థర్మల్ వవర్ ప్లాంట్‌కు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా పెరిగిన డిమాండ్‌కు తగినట్లుగా బొగ్గును సరఫరా చేస్తామన్నారు. కోలిండియా పరిధిలోని థర్మ ల్ విద్యుత్ కేంద్రాలూ సింగరేణి బొగ్గును కోరుకుంటున్నాయని తెలిపారు. కెపిసిఎల్ ఎండి కుమార్ నాయక్ మాట్లాడుతూ సింగరేణి బొగ్గు నాణ్యతను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేసేందుకు ఒప్పం దం కుదుర్చుకున్నామన్నారు. బొగ్గు సరఫరాకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఎగ్జికూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) ఎన్ శ్రీనివాస్, మార్కెటింగ్ జిఎం కిషన్ రావు, మార్కెటింగ్ ఎజిఎం ఎన్‌వికె శ్రీనివాసరావు, కర్ణాటక పవర్ కార్పొరేషన్ డైరెక్టర్ (టెక్నికల్) భాస్కర్, డైరెక్టర్ ఫైనాన్స్ నాగరాజు, ఈఈ యతిరాజు, లైజన్ అధికారి ఆండ్రివ్స్ పాల్గొన్నారు.

చిత్రం.. బొగ్గు సరఫరాకు ఒప్పందం కుదుర్చుకుంటున్న సింగరేణి సిఎండి శ్రీ్ధర్, కెపిసిఎల్ ఎండి కుమార్ నాయక్