బిజినెస్

నూతన శిఖరాలకు స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 10: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. మదుపరుల కొనుగోళ్ల జోరుతో సరికొత్త స్థాయిలకు చేరాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 355.01 పాయింట్లు ఎగబాకి, మునుపెన్నడూ లేనివిధంగా 31,715.64 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 105.25 పాయింట్లు ఎగిసి, ఇంతకుముందెప్పుడూ లేనివిధంగా 9,771.05 వద్ద నిలిచింది.
గత ఆరు వారాల్లో ఈ స్థాయిలో సూచీలు లాభపడటం ఇదే తొలిసారి. నిజానికి ఉదయం ఆరంభం నుంచే దూకుడు మీదున్న మదుపరులు.. ఏ దశలోనూ అమ్మకాల ఒత్తిడికి గురవ్వలేదు. ఫలితంగా ఆల్‌టైమ్ హై రికార్డు స్థాయికి స్టాక్ మార్కెట్లు చేరుకున్నాయి. టెక్నాలజీ, ఐటి, పిఎస్‌యు రంగాల షేర్లు 2.95 శాతం, 2.92 శాతం, 1.74 శాతం మేర లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, టిసిఎస్, విప్రో షేర్లు లాభాలను అందుకున్నాయి. దేశీయ ఐటి రంగ దిగ్గజాలైన టిసిఎస్, ఇన్ఫోసిస్‌లు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించనుండగా, గురు వారం టిసిఎస్, శుక్రవారం ఇన్ఫోసిస్ ప్రకటిస్తున్నాయ.
దీంతో అవి ఆశాజనకంగా ఉంటాయ న్న విశ్వాసంతో మదుపరులు ఐటి రంగ షేర్లను కొనుగోలు చేశారు. ఇక ఎన్‌ఎస్‌ఇలో బిఎస్‌ఇ షేర్ విలువ ఒకానొక దశలో 8.82 శాతం ఎగిసి 1,161.05 రూపాయలను తాకింది. అయితే చివరకు 1.70 శాతం లాభంతో 1,085.10 రూపాయల వద్ద ముగిసింది.
2 లక్షల కోట్ల డాలర్లకు
మదుపరుల సంపద
స్టాక్ మార్కెట్లు ఆల్‌టైమ్ హైకి చేరిన నేపథ్యంలో మదుపరుల సంపద సోమవారం ఒక్కరోజే భారీ స్థాయిలో పెరిగింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ) మార్కెట్ విలువ 1,29,60,905 కోట్ల రూపాయల (2 లక్షల కోట్ల డాలర్లు)కు చేరింది. బిఎస్‌ఇలో 5,200లకుపైగా సంస్థలున్నాయి. సోమవారం ట్రేడింగ్‌లో 2,800లకుపైగా సంస్థల షేర్ విలువ లాభాల్లోనే ముగిసింది.
దీంతో బిఎస్‌ఇ బ్లూచిప్ సూచీ సెనె్సక్స్ 355 పాయింట్ల వృద్ధితో 31,715.64 వద్ద స్థిరపడగా, మొత్తం బిఎస్‌ఇ మదుపరుల సంపద 1,45,731.93 కోట్ల రూపాయలు ఎగిసింది. ఇక ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) మార్కెట్ విలువ అన్నింటికంటే ఎక్కువగా 4,85,279.93 కోట్ల రూపాయలుగా ఉంది. ఆ తర్వాత దేశీయ ఐటి రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మార్కెట్ విలువ 4,67,248.89 కోట్ల రూపాయలుగా ఉంది. తర్వాతి స్థానాల్లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (4,31,537.28 కోట్ల రూపాయలు), ఐటిసి (4,04,970.91 కోట్ల రూపాయలు), హెచ్‌డిఎఫ్‌సి (2,60,939.86 కోట్ల రూపాయలు) ఉన్నాయి.
ఎన్‌ఎస్‌ఇలో 3:30 గంటలు
నిలిచిన ట్రేడింగ్
న్యూఢిల్లీ: సాంకేతిక సమస్య కారణంగా నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)లో సోమవారం 3:30 గంటలు ఆలస్యంగా ట్రేడింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు మొదలు కావాల్సిన ట్రేడింగ్.. మధ్యాహ్నం 12:30 గంటలకు ఆరంభమైంది.
అప్పటిదాకా నగదు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌ఒ) విభాగంలో ట్రేడింగ్ నిలిచిపోయింది. దీంతో మదుపరులకు కలిగిన ఈ అసౌకర్యానికి ఎన్‌ఎస్‌ఇ క్షమాపణలు చెప్పింది. మరోవైపు ఈ విషయంపై ప్రభుత్వం నివేదికను కోరింది.