బిజినెస్

దివీస్ ల్యాబ్ విశాఖ యూనిట్‌పై యుఎస్‌ఎఫ్‌డిఎ ఇంపోర్ట్ అలర్ట్ ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: విశాఖపట్నంలోని తమ యూనిట్‌పై అమెరికా హెల్త్ రెగ్యులేటర్ (యుఎస్‌ఎఫ్‌డిఎ) ఇంపోర్ట్ అలర్ట్‌ను ఎత్తివేసిందని ఔషధ రంగ సంస్థ దివీస్ లాబొరేటరీస్ సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది. యూనిట్-2పై విధించిన ఇంపోర్ట్ అలర్ట్ 99-32ను ఉపసంహరించుకుందని చెప్పింది. మరోవైపు సోమవారం ట్రేడింగ్‌లో దివీస్ ల్యాబ్ షేర్ విలువ ఒకానొక దశలో 20 శాతానికిపైగా పుంజుకుంది. బిఎస్‌ఇలో 19.99 శాతం లాభపడి 816.15 వద్దకు చేరింది. అయితే చివరకు 7.94 శాతం లాభంతో 734.15 వద్ద ముగిసింది.