బిజినెస్

పాత బంగారం, కార్ల అమ్మకంపై జిఎస్‌టి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: వ్యక్తులు అమ్మే పాత బంగారం, పాత వాహనాలపై ఎలాంటి వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) ఉండదని, ఎందుకంటే ఈ అమ్మకం వ్యాపారాన్ని పెంచుకోవడం కిందికి రాదని రెవిన్యూ డిపార్ట్‌మెంట్ గురువారం వివరణ ఇచ్చింది. బుధవారం రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా చేసిన వ్యాఖ్యలపై రెవిన్యూ డిపార్ట్‌మెంట్ వివరణ ఇస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. ఒక వినియోగదారుడినుంచి బంగారం వ్యాపారి కొనుగోలు చేసే పాత బంగారంపై మాత్రమే కేంద్ర జిఎస్‌టి చట్టంలోని సెక్షన్ 9(4) రివర్స్ చార్జి మెకానిజం కింద 3 శాతం జిఎస్‌టి వర్తిస్తుందని ఆ ప్రకటనలో తెలిపారు. అయితే ఒక వ్యక్తి పాత బంగారాన్ని తక్కువ ధరకే విక్రయించినప్పటికీ అది అతని వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం జరిపిందిగా పరిగణించరాదని, అందువల్ల అది సప్లై కిందికి రాదని పేర్కొంటున్న మరో సెక్షన్‌తో కలిపి దీన్ని అన్వయించుకోవాలని కూడా ఆ ప్రకటన తెలిపింది. అందువల్ల వ్యక్తులు బంగారం వ్యాపారికి విక్రయించే పాత బంగారంపై రివర్స్ చార్జి మెకానిజం కింద ఆ వ్యాపారి జిఎస్‌టి చెల్లించాల్సిన అవసరం లేదని ఆ ప్రకటన స్పష్టం చేసింది. ఇదే సూత్రం వ్యక్తులు విక్రయించే పాత కార్లు, ద్విచక్ర వాహనాలకు కూడా వర్తిస్తుందని రెవిన్యూ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఒక రిజిస్టర్ కాని బంగారు ఆభరణాల సరఫరాదారు రిజిస్టరయిన సరఫరాదారుకు అమ్మినప్పుడు మాత్రం రివర్స్ చార్జి మెకానిజం కింద రిజిస్టరయిన సప్లైదారు పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.