బిజినెస్

మార్కెట్లోకి ‘జీతో’ వ్యాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ప్రయాణికుల రవాణాకు ఉపయోగించే చిన్నపాటి వాణిజ్య వాహనం ‘జీతో’ మినీ వ్యాన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ముంబయిలో దీని (బిఎస్-4 డీజిల్ వేరియంట్) ఎక్స్-షోరూమ్ ధర రూ.3.45 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. డీజిల్‌తో పాటు పెట్రోల్, సిఎన్‌జి ఇంజన్ ఆప్షన్లతో కూడా ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ప్రయాణికుల రవాణాను లక్ష్యంగా చేసుకుని రెండు రకాల బాడీల (హార్డ్ టాప్, సెమీ హార్డ్ టాప్)తో ఈ వాహనాన్ని రూపొందించినట్లు ఆ సంస్థ పేర్కొంది.

చిత్రం.. ముంబయలో గురువారం ‘జీతో’ మినీ వ్యాన్‌ను ఆవిష్కరిస్తున్న ఎంఅండ్‌ఎం ఆటోమోటివ్ ప్రెసిడెంట్
రాజన్ వధేరా