బిజినెస్

ఎఫ్‌డిఐ విధానంపై నేడు ప్రధాని సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ) రాకలో ఇబ్బందులను తొలగించే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రత్యక్ష పెట్టుబడుల విధానంపై సమీక్ష నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. దేశంలో ఎఫ్‌డిఐ విధానాన్ని స్ట్రీమ్‌లైన్ చేయడం కోసం చేయనున్న మార్పులపై ఈ సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రజంటేషన్ ఇవ్వనుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం(డిఐపిపి) కార్యదర్శి రమేష్ అభిషేక్‌లు ఈ సమావేశానికి హాజరవుతారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి చెప్పారు. ప్రింట్ మీడియా, నిర్మాణ రంగం, సింగిల్ బ్రాండ్, మల్టీబ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ రంగాల్లో ఎఫ్‌డిఐ నిబంధనలను సడలించాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యతను సంతరించుకొంది.