బిజినెస్

రిలయన్స్ సెక్యూరిటీస్ లాభం రూ.7 కోట్లకు పెరుగుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: ఈ ఆర్థిక సంవత్సరం జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో తమ సంస్థ పన్ను చెల్లింపునకు ముందు లాభం 7 కోట్ల రూపాయలకు పెరిగినట్లు రిలయన్స్ క్యాపిటల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ సెక్యూరిటీస్ గురువారం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ పన్నుకు ముందు లాభం రూ .28 లక్షలుగా ఉంది. కాగా, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం ఆదాయం 51 శాతం పెరిగి రూ. 82 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ తెలిపింది. గత ఏడాది ఈ మొత్తం రూ 52 కోట్లుగా ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పెట్టుబడి ఉత్పత్తుల పంపిణీపై మరింతగా దృష్టి పెట్టడంతో పాటుగా గత 18 నెలలుగా క్యాష్ మార్కెట్ విభాగంపై దృష్టిని కేంద్రీకరించడం తమ వృద్ధికి ప్రధాన కారణమని రిలయన్స్ సెక్యూరిటీస్ ఇడి, సిఈఓ బి గోప్ కుమార్ తెలిపారు. ఈక్విటీ బ్రోకింగ్ విభాగంలో సగటున రోజువారీ టర్నోవర్ గత ఏడాదితో పోలిస్తే 52 శాతం పెరిగి రూ. 3,942 కోట్లు ఉందని, అలాగే నగదు ఈక్విటీ విభాగంలో సగటు రోజువారీ టర్నోవర్ 42 శాతం పెరిగి రూ.278 కోట్లకు చేరిందని కంపెనీ ఆ ప్రకటనలో తెలిపింది.