బిజినెస్

నెఫ్ట్, ఆర్‌టిజిఎస్ చార్జీలను తగ్గించిన ఎస్‌బిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్), ఆర్‌టిజిఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్) చార్జీలను 75 మేరకు తగ్గించింది. ఈ తగ్గింపు చార్జీలు ఈ నెల 15వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఎస్‌బిఐ వెల్లడించింది. దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ చార్జీలను తగ్గించామని, తమ మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా జరిపే నెఫ్ట్, ఆర్‌టిజిఎస్ లావాదేవీలకు ఈ చార్జీలు వర్తిస్తాయని ఎస్‌బిఐ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థలైన నెఫ్ట్, ఆర్‌టిజిఎస్ దేశంలోని రెండు వేర్వేరు బ్యాంకు ఖాతాల మధ్య నిధుల బదిలీకి వీలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. నెఫ్ట్‌ను ఉపయోగించి ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ పద్ధతుల్లో జరిపే 10 వేల రూపాయల లోపు నగదు బదిలీకి ఇప్పటివరకూ 2 రూపాయల చొప్పున వసూలు చేసిన ఎస్‌బిఐ ఇప్పుడు ఆ చార్జీని 1 రూపాయికి (వస్తు, సేవల పన్ను మినహా) తగ్గించింది. అలాగే రూ.10 వేల నుంచి లక్ష రూపాయల లోపు నగదు బదిలీపై గతంలో 4 రూపాయలుగా ఉన్న నెఫ్ట్ చార్జీని 2 రూపాయలకు, రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల లోపు నగదు బదిలీపై ఆర్‌టిజిఎస్ చార్జీని 20 రూపాయల నుంచి 5 రూపాయలకు తగ్గించింది.
పాత బంగారం, కార్ల అమ్మకంపై జిఎస్‌టి లేదు