బిజినెస్

నిరాశ పరిచిన టిసిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, జూలై 13: దేశంలోనే అతిప్దెద సాఫ్ట్‌వేర్ సర్వీసుల ఎగుమతి సంస్థ టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ (టిసిఎస్)నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 6 శాతం మేర తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో కంపెనీ 6,317 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించగా, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అది రూ.5,945 కోట్లకు తగ్గిపోయింది. డాలరుతో రూపాయి బలపడ్డం మూలంగా కంపెనీ రెవెన్యూ తగ్గిపోవడం కారణంగా టిసిఎస్ మార్కెట్ అంచనాలకు చేరుకోలేకపోయిందని వివ్లేషకులు అంటున్నారు. సాధారణంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికం ఐటి సంస్థలకు బలంగా ఉంటుంది. అయితే ఈ సారి నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితులు, ఐటి రంగంపై కంపెనీలు ఖర్చును తగ్గించుకోవడం, బ్యాంకింగ్-ఆర్థిక సేవల రంగాల్లో కొత్త ప్రాజెక్టులు మందగించడం లాంటివి కూడా కంపెనీ లాభాలపై ప్రభావం చూపించాయని నిపుణులు అంటున్నారు. అయితే గత ఏడాదితో పోలిస్తే కంపెనీ కన్సాలిడేటెడ్ రెవిన్యూ ఒక శాతం పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ రెవిన్యూ రూ.29,305 కోట్లు ఉండగా ఇప్పుడు అది రూ.29,584 కోట్లకు పెరిగింది.
డాలరుతో రూపాయి విలువ పెరగడం అంటే కంపెనీ రెవిన్యూలో 650 కోట్ల డాలర్ల నష్టమని టిసిఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి రామకృష్ణన్ చెప్పారు. ఈ ఏడాది డాలరుతో రూపాయి విలువ అయిదు శాతం పెరిగింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ అన్ని రంగాల్లో నిలకడయిన వృద్ధిని సాధించిందని టిసిఎస్ సిఈఓ, ఎండి రాజేష్ గోపీనాథన్ చెప్పారు. అన్ని మార్కెట్లలో తాము అద్భుత విజయాలు సాధించామని, అన్ని రంగాల పరిశ్రమల్లోను కొత్త ఒప్పందాలను కుదుర్చుకొన్నామని, ఇవి తమను ఈ ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి తోడ్పడతాయని ఆయన చెప్పారు. కాగా, కంపెనీ ప్రతి షేరుపై 7 రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. కాగా, త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లలో టిసిఎస్ షేర్ల ధరలు స్వల్పంగా పెరిగాయి.

చిత్రం.. ముంబయలో గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న టిసిఎస్ ఉన్నతాధికారులు