బిజినెస్

నీరసించిన ఆంధ్రా బ్యాంక్ లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: ఈ ఏడాది మార్చితో ముగిసిన 2015-16 ఆర్ధిక సంవత్సరంలో 3,10,673 కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్లు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంక్ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2014-15లో 2,84,588 కోట్ల రూపాయలుగా ఉందని శనివారం బ్యాంక్ ప్రకటించింది.
అయితే చివరి త్రైమాసికంలో 72 శాతం నికర లాభం క్షీణించినట్లు వెల్లడించింది. జనవరి-మార్చిలో 52 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 185 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు తెలిపింది. ఆదాయం మాత్రం 4,699 కోట్ల రూపాయల నుంచి 5,124 కోట్ల రూపాయలకు పెరిగింది. కాగా, 2015-16 మొత్తంగా బ్యాంక్ లాభం 540 కోట్ల రూపాయలుగా నమోదైంది. 2014-15లో 638 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో టైర్-1 బాండ్లను జారీ చేయడం ద్వారా 800 కోట్ల రూపాయలను సమీకరించినట్లు తెలిపింది. డిపాజిట్ల సేకరణలో 12.4 శాతం వృద్ధి సాధించి 1,74,302 కోట్ల రూపాయలకు చేరుకున్నామని పేర్కొంది. ప్రాధాన్యతా రంగాలకు ఇచ్చే అడ్వాన్స్‌ల్లో కూడా 21.3 శాతం పెరిగి 54,545 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు బ్యాంక్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.