బిజినెస్

ఆర్థిక వ్యవస్థలో సిఎల పాత్ర కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 14: దేశ ఆర్థిక వ్యవస్థలో సిఎ (చార్టర్డ్ అకౌంటెంట్లు)ల పాత్ర అత్యంత కీలకమైనదిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఐఎన్‌ఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి మధుసూదన్ అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ ఆఫ్ ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సబ్ రీజనల్ కాన్ఫరెన్స్‌లో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి సిఎల తోడ్పాటు ఎంతగానో ఉంటుందన్నారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను ఒక అవకాశంగా తీసుకోవాలని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సిఎ విద్యార్థులు వాడుకోవాలని ఆయన సూచించారు. రానున్న రోజుల్లో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయన్నారు. అలాగే సిఎ సిలబస్ కొత్తది జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. గ్లోబల్ స్టాండర్డ్‌కు అనుగుణంగా రూపొందించే దీనిని సిఎలు సద్వినియోగపర్చుకోవాల్సిందిగా ఆయన సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండేందుకు సిఎలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. పారిశ్రామికంగా సేవలందించాలన్నా, ప్రొఫెషనల్‌గా ఎదగాలన్నా, సేవాపరంగాను, వ్యాపారపరంగాను సిఎల బాధ్యత కీలకమైనదిగా తెలిపారు. ఎస్‌ఐఆర్‌సి ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా చైర్మన్ కోతా ఎస్ శ్రీవినాస్ మాట్లాడుతూ పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి పది లక్షల కోట్ల మేర ఆదాయం వస్తుందన్నారు. పన్నుల వసూళ్ళల్లో సిఎలు కీలకమన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో సిఎలకు వెబ్ తరగతులు నిర్వహిస్తున్నామని, వీటిని సిఎలు సద్వినియోగపర్చుకోవాల్సిందిగా సూచించారు. దేశ నలుమూలల నుంచి 500 మంది ప్రతినిధులు రెండు రోజుల కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వైస్ చైర్మన్ ఏ వెంకటేశ్వరరావు, విశాఖ బ్రాంచి చైర్మన్ బి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌ఐఎన్‌ఎల్, సిసిఐ ఒప్పందం
హైదరాబాద్: రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్ లేదా విశాఖ స్టీల్ ప్లాంట్), సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)తో ఓ ఎమ్‌ఒయును కుదుర్చుకుంది. ఈ మేరకు శుక్రవారం ఆర్‌ఐఎన్‌ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం 150 కోట్ల రూపాయల వ్యయంతో 2 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన సిమెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

చిత్రం..కాన్ఫరెన్స్‌ను ప్రారంభిస్తున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ సిఎండి మధుసూదన్