బిజినెస్

ఆశాజనకంగా పొగాకు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 14: ఈ ఏడాది తొర్రేడు కేంద్ర పొగాకు బోర్డు వేలం కేంద్రం పరిధిలో పొగాకు ధర ఆశాజనకంగా సాగింది. మొత్తం 37.76 కోట్ల రూపాయల విలువైన పొగాకు దిగుబడి వేలంలో కొనుగోలు జరిగింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా 13 పొగాకు కంపెనీలు పొగాకు వేలంలో పాల్గొని కొనుగోళ్లకు ఇక్కడకు తరలివచ్చాయి. ఏప్రిల్ 6వ తేదీన మొదలైన వేలం.. మొత్తం 75 రోజులపాటు జరిగింది.
ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో పొగాకు పంట దెబ్బ తినడంతో తొర్రేడు వేలం కేంద్రం పరిధిలో సాగు చేసిన పొగాకు అధిక ధర లభించింది. పొదిలి ప్రాంతంలో 20 మిలియన్ మెట్రిక్ టన్నుల దిగుబడి లక్ష్యం అవగా, కేవలం 2 నుంచి 3 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుబడి వచ్చిందంటే అక్కడ పొగాకు సాగు నష్టం ఏ మేరకు జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
దక్షిణాది నల్లరేగడి, తేలికపాటి నేలల్లో పొగాకు దెబ్బతినడంతోపాటు నిర్దేశిత లక్ష్యం కంటే దిగుబడి తక్కువ కావడంవల్ల తొర్రేడులోని కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పొగాకు వేలం కేంద్రం పరిధిలో ఈ ఏడాది అత్యధిక ధర లభించింది. అయితే ఈ ఏడాది ధరలను బట్టి వచ్చే ఏడాది ఇదే తరహాలో ధరలు లభిస్తాయని ఆశిస్తూ పంట వేస్తే మాత్రం రైతులకు భంగపాటు తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. చిత్రమేమిటంటే ఈ ఏడాది ధర ఆశాజనకంగా ఉండటంతో భూముల కౌలు కూడా అప్పుడే పెంచేశారు. వర్జీనియా పొగాకు సాగు చేసే రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గు చూపాలని అధికారులు కూడా సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పొగాకు సాగు విస్తీర్ణంలో క్రమేణా తగ్గుముఖం పట్టింది. తొర్రేడు వేలం కేంద్రం పరిధిలో మొత్తం 40 లక్షల కేజీల దిగుబడి లక్ష్యం అవగా, కేవలం 28.85 లక్షల కేజీల దిగుబడి మాత్రమే లభించింది. శుక్రవారం జరిగిన పొగాకు వేలానికి మొత్తం 432 బేళ్లను రైతులు తీసుకురాగా, అందులో 398 బేళ్లు మాత్రమే అమ్ముడుపోయాయి. కేజీ పొగాకుకు 156 రూపాయల 54 పైసల సరాసరి ధర లభించింది.
179 రూపాయలు అత్యధిక ధర అవగా, 55 రూపాయలు అత్యల్ప ధర. మొత్తం 37 కోట్ల 76 లక్షల 21 వేల 864 రూపాయల విలువైన పొగాకు విక్రయాలు జరిగాయి. శనివారంతో పొగాకు వేలం ముగియనుంది. ఈ క్రమంలో శుక్రవారానికి 28 లక్షల 35,300 కేజీల పొగాకు విక్రయం జరిగిందని తొర్రేడు పొగాకు వేలం కేంద్రం సూపర్ వైజర్ వై సుబ్రహ్మణ్యం తెలిపారు.
మరోవైపు పొగాకు సాగు విస్తీర్ణం ఏటికేడాది తగ్గుముఖం పడుతోంది. ఈ ఏడాది 1,397 మంది పొగాకు సాగుచేసే రైతులు 1,497 బ్యారన్లకు పొగాకు బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ పొందారు. ఇందులో 1,151 మంది రైతులు మాత్రమే 1,235 బ్యారన్ల పొగాకు సాగు చేశారు. ఈ మేరకు 1,470 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు జరిగింది.
అయితే సరాసరి ధర ఇప్పటివరకు బ్రైట్ గ్రేడ్ రకానికి 156.96 రూపాయలు, మీడియం రకాలకు సరాసరిగా 133.08 రూపాయలు, తక్కువ స్థాయి రకాలకు సరాసరిగా 75.08 రూపాయల ధర లభించింది. ఇప్పటివరకు జరిగిన వేలంలో సరాసరిగా 156.54 రూపాయల ధర లభించింది. నిరుడు 81 రోజులపాటు సాగిన వేలం ప్రక్రియలో మొత్తం 27 లక్షల కేజీల పొగాకు అమ్మకాలు జరిగాయి. 99.28 రూపాయల సరాసరి ధర మాత్రమే దక్కింది.