బిజినెస్

2017 ఫోర్బ్స్ ‘గ్లోబల్ 2,000’ జాబితాలో 50 భారతీయ సంస్థలకు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన 2 వేల సంస్థల్లో భారత్‌కు చెందినవి 50 ఉన్నాయి. అయితే టాప్-100 సంస్థల్లో మాత్రం ఒక్కటీ లేకపోవడం గమనార్హం. ఇకపోతే ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ వార్షిక జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ సంస్థల విషయానికొస్తే.. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ఇతర భారతీయ సంస్థలన్నింటికంటే ముందుంది. మొత్తం జాబితాలో ఆర్‌ఐఎల్‌కు 106వ స్థానం దక్కింది. అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకుని ప్రపంచ స్థాయ బ్యాంకర్‌గా అవతరించిన ఎస్‌బిఐ తర్వాతి స్థానంలో నిలిచింది. బ్యాంకింగ్, చమురు, ఆటో, ఐటి, ఫైనాన్స్, ఉక్కు, విద్యుత్, టెలికామ్, నిర్మాణ, ఔషధ, వౌలిక తదితర రంగాల సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయ. కాగా, 2017 ఫోర్బ్స్ ‘గ్లోబల్ 2000’ పేరుతో వచ్చిన ఈ జాబితాలో అమెరికా, చైనా-హాంకాంగ్ దేశాల ఆధిపత్యం కనిపించింది. మొత్తం 2,000 సంస్థల్లో అమెరికాకు చెందినవే 565 ఉన్నాయి.
ఆ తర్వాత చైనా- హాంకాంగ్‌కు చెందినవి 263 సంస్థలున్నాయి. అయితే చైనాకు చెందిన సంస్థలే ఈ జాబితాలో తొలి రెండు స్థానాలు సొంతం చేసుకున్నట్లు ఫోర్బ్స్ స్పష్టం చేసింది. అంతేగాక టాప్-500 సంస్థల్లో 12 శాతం చైనా-హాంకాంగ్‌కు చెందినవే ఉన్నాయని తెలిపింది. 2003 నుంచి ఫోర్బ్స్ ఈ జాబితాను విడుదల చేస్తుండగా, నాడు చైనా-హాంకాంగ్ సంస్థల వాటా టాప్-500లో 2 శాతం మాత్రమే ఉందని ఫోర్బ్స్ పేర్కొంది.
ఇదిలావుంటే తాజా జాబితాలో ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసిబిసి)కు ప్రథమ స్థానం, చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంక్ (సిసిబి)కు ద్వితీయ స్థానం లభించాయి. వీటికిలా అగ్రస్థానాలు దక్కడం వరుసగా ఇది ఐదో ఏడాది కావడం విశేషం.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 106
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 244
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 258
ఇండియన్ ఆయల్ 264
టాటా మోటార్స్ 290
ఐసిఐసిఐ బ్యాంక్ 310
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 376
ఎన్‌టిపిసి 408
యాక్సిస్ బ్యాంక్ 463
లార్సెన్ అండ్ టూబ్రో 483
భారతీ ఎయర్‌టెల్ 513
కోల్ ఇండియా 541
భారత్ పెట్రోలియం 583
ఇన్ఫోసిస్ 598
కొటక్ మహీంద్ర బ్యాంక్ 744
హిందుస్థాన్ పెట్రోలియం 807
పవర్ గ్రిడ్ ఆఫ్ ఇండియా 884
మహీంద్ర అండ్ మహీంద్ర 916
హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ 958
టాటా స్టీల్ 1076
పవర్ ఫైనాన్స్ 1086
బ్యాంక్ ఆఫ్ బరోడా 1145
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1148
హిందాల్కో ఇండస్ట్రీస్ 1175
కెనరా బ్యాంక్ 1230
రూరల్ ఎలక్ట్రిఫికేషన్ 1234
యెస్ బ్యాంక్ 1239
బ్యాంక్ ఆఫ్ ఇండియా 1250
ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1272
గెయల్ ఇండియా 1283
జెఎస్‌డబ్ల్యు స్టీల్ 1347
యూనియన్ బ్యాంక్ 1420
బజాజ్ ఆటో 1435
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 1513
ఐడిబిఐ బ్యాంక్ 1524
రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ 1556
హీరో మోటోకార్ప్ 1587
గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 1622
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1664
లుపిన్ 1716
సిండికేట్ బ్యాంక్ 1745
ఏషియన్ పెయంట్స్ 1783
ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ 1828
అలహాబాద్ బ్యాంక్ 1845
యూకో బ్యాంక్ 1849
ఓరియంటల్ బ్యాంక్ 1859
సెయల్ 1930
ఇండియాబుల్స్ హెచ్‌ఎఫ్ 1934
ఇండియన్ బ్యాంక్ 1937
టెక్ మహీంద్ర 1998