బిజినెస్

‘మరో 5.56 లక్షల మంది వెలుగులోకి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: పాత పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆదాయానికి, ఖాతాల్లో డిపాజిట్ చేసిన నగదు మొత్తాలకు పొంతనలేని మరో 5.56 లక్షల మందిని ఆదాయ పన్ను (ఐటి) శాఖ గుర్తించింది. ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ రెండో దశను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐటి శాఖ మొదలు పెట్టినది తెలిసిందే. ఈ క్రమంలోనే నోట్ల రద్దు తర్వాత నల్లధనం ఉనికిని కనిపెట్టే పనిలో ఐటి అధికారులు నిమగ్నమయ్యారు. దాని ఫలితమే ఈ 5.56 లక్షల మంది బహీర్గతమయ్యారు. వీరి ఆదాయానికి, వారివారి ఖాతాల్లో జమ చేసిన రద్దయిన నోట్ల విలువకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు ఓ ప్రకటనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.