బిజినెస్

త్వరలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెట్రాయిట్, మే 7: సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు (స్వయం చోదక వాహనాలు) త్వరలో వచ్చేస్తున్నాయి. ఇవి ఇక రోడ్లపై తిరగడానికి ఎంతో కాలం పట్టదని అంతర్జాతీయ ఆటోరంగ సంస్థ ఫియట్ చెబుతోంది. నిజానికి డ్రైవర్ లేకుండానే నడిచే ఈ కార్లు అందుబాటులోకి రాబోతున్నాయనే మాట ఎప్పట్నుంచో వినిపిస్తోంది. అయితే ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చుతోందని ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ (ఎఫ్‌సిఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సర్జియో మార్చియొనె్న అంటున్నారు. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌తో కలిసి పనిచేసేందుకు ఎఫ్‌సిఎ కొద్ది రోజుల క్రితమే అంగీకరించిన నేపథ్యంలో పూర్తి స్థాయలో మరో ఐదేళ్లలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రోడ్లపైకి వస్తాయని సర్జియో చెబుతున్నారు. ‘దాదాపు 20 ఏళ్లుగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రాబోయే ఐదేళ్లలో ఇవి అందుబాటులోకి వస్తాయని నేననుకుంటున్నాను.’ అని అన్నారు. ఆల్ఫాబెట్ సంస్థ తమ గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను భారీ ఎత్తున విస్తరించే దిశలో భాగంగా ఈ వారం ఎఫ్‌సిఎతో చేతులు కలిపింది. అయితే దీనికి సంబంధించిన ఆర్థికపరమైన లావాదేవీలను తెలిపేందుకు సర్జియో నిరాకరించారు. ఇటలీ-అమెరికన్ బహుళజాతి సంస్థ అయిన ఎఫ్‌సిఎ.. ప్రస్తుతం ఆటో రంగంలో ప్రపంచంలోనే ఏడో అతిపెద్ద సంస్థగా ఉంది. ఒంటారియాలోని విండ్సర్ వద్దనున్న 88 ఏళ్ల చరిత్ర కలిగిన ప్లాంట్‌లో కొత్తగా ‘2017 క్రిస్లర్ పసిఫికా మినీవ్యాన్ల’ ఉత్పత్తిని శుక్రవారం ఎఫ్‌సిఎ ప్రారంభించింది. ఈ సందర్భంగా సంస్థ సిఇఒ సర్జియో విలేఖరులతో మాట్లాడుతూ ఈ ఏడాది ఆఖరుకల్లా ఈ హైబ్రిడ్ మినీవ్యాన్లు రోడ్డెక్కుతాయన్నారు. గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ హార్డ్‌వేర్‌కు బ్యాటరీ ఎలక్ట్రిక్ పవర్‌తో రూపొందిస్తున్న ఈ మినీవ్యాన్లు సరిగ్గా సరిపోతాయన్నారు. ఈ క్రమంలోనే రాబోయే ఐదేళ్లలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రానున్నాయని ఆయన చెప్పారు. మరోవైపు ‘ఎఫ్‌సిఎ తయారు చేస్తున్న మినీవ్యాన్లు మా సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థను సులభంగా స్వీకరిస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉన్న మా కంప్యూటర్లకు ఇవి సరిగ్గా సరిపోతాయి. వాహనం రహదారిపై వెళ్తున్నప్పుడు చుట్టుప్రక్కల ఏమున్నాయో అన్నది సెన్సార్ల ద్వారా గ్రహిస్తుంది.’ అని గూగుల్ ప్లస్ సోషల్ నెట్‌వర్క్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తయారీ బృందం చెప్పింది. ఇదిలావుంటే తమ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీకి లైసెన్సు లేదని, కాబట్టి ఇంకా ఈ కార్ల అమ్మకాలపై దృష్టి పెట్టడం లేదని ఆల్ఫాబెట్ తెలిపింది. అలాగే వీటి ధర, ఎలాంటి సౌకర్యాలు వీటిలో పెట్టాలన్న తదితర అంశాలపై ఏకాభిప్రాయానికి రాలేదంది. అయినప్పటికీ త్వరలోనే ఈ కార్లను అందిస్తామన్న ఆశాభావాన్ని సర్జియో వ్యక్తం చేశారు.

chitram విలేఖరులతో మాట్లాడుతున్న ఎఫ్‌సిఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సర్జియో మార్చియొనె్న