బిజినెస్

జిఎస్‌టిని సరిగ్గా అర్థం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లుథియానా (పంజాబ్)/న్యూఢిల్లీ, జూలై 15: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అనేది చాలా సరళమైన పన్ను అని, అయినప్పటికీ అవగాహన లోపంతో దీనిపై ఎన్నో అపోహాలు, పుకార్లు చెలరేగుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ‘జిఎస్‌టి అనేది ఓ సరళమైన పన్ను. కానీ దీన్ని కొందరు కఠినమైన పన్నుగా భావిస్తున్నారు. కష్టతరమైన పన్ను చెల్లింపుల ప్రక్రియగా ఊహించుకుంటున్నారు.’ అని శనివారం ఇక్కడ జైట్లీ వ్యాఖ్యానించారు. బిజెపి నూతన కార్యాలయం శంకుస్థాపనకు విచ్చేసిన జైట్లీ.. జిఎస్‌టిపై నెలకొన్న భయాలను పోగొట్టే ప్రయత్నం చేశారు. కాగా, తమ లాభాల్లో కనీసం 2 శాతాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్)కు వెచ్చించాలని ఈ సందర్భంగా జైట్లీ వ్యాపార, పారిశ్రామిక రంగాలను కోరారు. మరోవైపు ఈ నెల 30లోగా జిఎస్‌టి క్రింద వ్యాపారులంతా కూడా నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. అయితే 20 లక్షల రూపాయల దిగువన వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారులకు అక్కర్లేదంది. ఇదిలావుంటే జిఎస్‌టి శిక్షణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రారంభించింది. జిఎస్‌టి క్రింద పన్ను చెల్లింపులు, ఇతరత్రా కార్యకలాపాలను నిర్వహించేందుకు రెండు లక్షల మంది యువతకు ఈ కార్యక్రమంలో భాగంగా నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. కాగా, జిఎస్‌టి అమలును దేశంలో అవినీతి నిర్మూలనకు చక్కని చర్యగా అభివర్ణించారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ఇకపోతే న్యాయవాదులు అందించే లీగల్ సేవలు జిఎస్‌టి పరిధిలోకే వస్తాయని సిబిఇసి శనివారం స్పష్టం చేసింది. ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను నినాదంతో దేశవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పరోక్ష పన్నుల విధానం (జిఎస్‌టి)లో 1,200లకుపైగా వస్తువులు, 500ల సేవలకు కలిపి నాలుగు శ్లాబుల్లో పన్ను రేట్లను నిర్ణయించారు. 5, 12, 18, 28 రేట్లలో ఈ పన్నులను వేయగా, బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం పన్నును విధించారు. విద్య, వైద్యం, తాజా కూరగాయలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. ఎక్సై జ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ తదితర 16 వేర్వేరు పన్నులను జిఎస్‌టిలో కలిపేశారు. దీనివల్ల రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతుండగా, జిఎస్‌టి అమలును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తొలి ఐదేళ్లు నష్టపరిహారం కూడా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిం ది. ఈ క్రమంలోనే లగ్జరీ, ఆరోగ్యానికి హానికరం చేసే ఉత్పత్తులపై 43 శాతం వరకు పన్ను భారాన్ని మోపింది కేం ద్రం. గరిష్ఠ పన్ను 28 శాతానికితోడు 15 శాతం అదనపు పన్ను వేస్తోంది.