బిజినెస్

క్షీణించిన టాటా మోటార్స్ విదేశీ అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ విదేశీ అమ్మకాలు గత నెలలో 1.71 శాతం క్షీణించాయి. నిరుడు జూన్‌లో 92,551 యూనిట్ల విక్రయాలు జరిగితే, ఈసారి జూన్‌లో 90,966 యూనిట్లకే పరిమితమైంది. ఈ విక్రయాల్లో టాటా మోటార్స్ లగ్జరీ కార్ల బ్రాండైన జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) కూడా ఉంది. ఇక ప్యాసింజర్ కార్ల విభాగంలో విదేశీ విక్రయాలు ఈసారి జూన్‌లో 60,725 యూనిట్లుగా నమోదయ్యాయి. నిరుడు జూన్‌లో ఇవి 59,831 యూనిట్లుగా ఉన్నాయి. దీంతో ఈసారి 1.5 శాతం వృద్ధి నమోదైనట్లయింది. వాణిజ్య వాహనాల విభాగంలో ఈసారి 30,241 యూనిట్లు, పోయినసారి 32,720 యూనిట్లుగా ఉన్నాయి. 7.57 శాతం పడిపోయాయి. ఇక ఈసారి ప్యాసింజర్ అమ్మకాల్లో జెఎల్‌ఆర్ వాహనాలు గతంతో పోల్చితే 4.7 శాతం పెరిగి 47,197 యూనిట్ల నుంచి 49,422 యూనిట్లకు ఎగిశాయి. ఈ మేరకు టాటా మోటార్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.