బిజినెస్

ఉద్యోగుల కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాన్‌ఫ్రాన్సిస్కో, జూలై 15: ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాల నెలవైన కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ఉద్యోగుల వసతి సమస్య తీవ్రతరమైంది. ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్, ఒరాకిల్, హెచ్‌పి, యూట్యూబ్.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ప్రముఖ వెబ్‌సైట్ల ప్రధాన కార్యాలయాలు ఉన్నది సిలికాన్ వ్యాలీలోనే. అయితే ఇప్పుడు ఈ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇక్కడ ఉండటం పెద్ద తలనొప్పిగా పరిణమించింది. దీన్ని అర్థం చేసుకున్న ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు వసతి సదుపాయాలు కల్పించడంపై దృష్టిపెట్టాయి. నిజానికి ఈ సమస్యపై ఇప్పటికే స్పందించిన ఆయా సంస్థలు తమ ఉద్యోగులు కార్యాలయం దగ్గరగానే, అన్నివేళలా అందుబాటులో ఉండేలా 10,000 డాలర్లు బోనస్‌గా ఇచ్చాయి. ఇలాంటి సంస్థల్లో ఫేస్‌బుక్ ఒకటి. ఆఫీసుకు దూరంగా నివాసం ఉంటున్న ఉద్యోగులు.. ఆఫీసు దగ్గర్లో ఉండేలా కనీసం 10,000 డాలర్లకు తగ్గకుండా ఉద్యోగులకు బోనస్‌ను ఇచ్చింది. సిలికాన్ వ్యాలీలో నివాసం ఖరీదైనది కావడంతో చాలామంది ఉద్యోగులు ఆఫీసుకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఉద్యోగులపై భారం పడకుండా తమపైనే వేసుకుంది ఫేస్‌బుక్. అయితే డిమాండ్ పెరగడంతో ఇండ్లు, ఫ్లాట్లు దొరకడం కష్టతరమైపోయింది. కొందామన్నా.. ఉందామన్నా.. ధరలు, అద్దెలు బాగా పెరిగిపోయాయి. ఫలితంగా ఉద్యోగుల కోసం స్వయంగా ఇండ్ల నిర్మాణానికి సిద్ధమైపోతున్నాయి ఆయా సంస్థలు. ఇందులో కూడా ఫేస్‌బుక్ అన్నింటికంటే ముందుంది. ఏకంగా ఓ విలేజ్‌నే నిర్మించాలనుకుంటోంది ఈ టెక్నాలజీ దిగ్గజం. అందులో 1.75 మిలియన్ చదరపు అడుగుల్లో కార్యాలయానికి, 1,25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్ స్పేస్‌కు స్థలాన్నీ కేటాయించింది. తమ ప్రధాన కార్యాలయం సమీపంలో కొలువుదీరే ఈ గ్రామంలో 1,500 ఫ్లాట్లను నిర్మిస్తోంది ఫేస్‌బుక్. ఇదే తరహాలో మరిన్ని సంస్థలు ఆలోచిస్తుండగా, ఉద్యోగులకిచ్చే బోనస్‌లు మిగులుతాయని, సిబ్బంది వసతి సమస్యకు శాశ్వత పరిష్కారం కూడా లభించినట్లవుతుందని భావిస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి ఉద్యోగులను రోజూ బస్సుల్లో సంస్థకు తరలించే పని కూడా తప్పుతుందని అనుకుంటున్నాయి. గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ సైతం ఓ 300 మాడ్యులర్ అపార్ట్‌మెంట్ యూనిట్లను ఉద్యోగుల కోసం కొంటోంది. కాగా, దక్షిణ శాన్‌ఫ్రాన్సిస్కోకు 72 కిలోమీటర్ల దూరంలోగల మెన్లో పార్క్‌లో నిర్మాణాలు చేపట్టాలని ఫేస్‌బుక్ కోరుకుంటోంది. 2011లో ఇక్కడికే ఫేస్‌బుక్ తరలిపోయింది. దీంతో కార్యాలయం దగ్గర్లోనే పెట్టుబడులు పెట్టడం లాభదాయకంగా భావిస్తోంది. అయితే నిర్మించే 1,500 హౌసింగ్ యూనిట్లలో ఉద్యోగులేగాక ఎవరైనా ఉండొచ్చని, మార్కెట్ ధర కంటే వారికి 15 శాతం తక్కువకే విక్రయిస్తామని ఫేస్‌బుక్ అంటుండటం గమనార్హం. అయితే ఈ వ్యవహారం తేలాలంటే మరో రెండేళ్ల సమయమైనా పట్టచ్చంటోంది ఫేస్‌బుక్. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఫేస్‌బుక్ ప్లాన్‌తో మెన్లో పార్క్ రద్దీ పెరగవచ్చన్న ఆందోళనను మెన్లో పార్క్ మేయర్ కిర్‌స్టెన్ కెయత్ వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ పెట్టుబ డులు, దాని నిర్మాణాలపై సిటీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. దీంతో ప్రాజెక్టు ఆలస్యం కానుంది. మొత్తానికి ఉద్యోగులకు వసతి సదుపాయాల కొరతతో సిలికాన్ వ్యాలీలో ఐటి దిగ్గజాలన్నీ కూడా నిర్మాణ రంగం వైపు నడుస్తున్నాయి. వేలాది మంది సిబ్బంది కోసం అన్ని సంస్థలూ ఇదే నిర్ణయానికి వస్తే సిలికాన్ వ్యాలీ ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్లేనని ఐటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల సంస్థలపై ఆర్థికంగా పెద్ద భారం పడకపోవచ్చని, కానీ ఉద్యోగుల్లో మాత్రం విశ్వసనీయత పెరుగుతుందంటున్నారు.