బిజినెస్

24న జిఎస్‌టిఎన్ పోర్టల్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: వ్యాపారులు తమ అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి బిల్లుల అప్‌లోడింగ్‌ను ఈ నెల 24 నుంచి జిఎస్‌టిఎన్ పోర్టల్‌పై చేసుకోవచ్చని జిఎస్‌టిఎన్ చైర్మన్ నవీన్ కుమార్ పిటిఐకి తెలిపారు. ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను నినాదంతో దేశవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి జిఎస్‌టి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి నమోదైన బిల్లులను 24 నుంచి అప్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. నెలవారీగా బిల్లులను అప్‌లోడ్ చేసుకునే బదులుగా రోజువారి, వారానికోసారి అప్‌లోడ్ చేసుకుంటే రద్దీ తక్కవగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ పరోక్ష పన్నుల విధానం (జిఎస్‌టి)లో 1,200లకుపైగా వస్తువులు, 500ల సేవలకు కలిపి నాలుగు శ్లాబుల్లో పన్ను రేట్లను నిర్ణయించారు. 5, 12, 18, 28 రేట్లలో ఈ పన్నులను వేయగా, బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం పన్నును విధించారు. విద్య, వైద్యం, తాజా కూరగాయలకు, ఆహార పదార్థాలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ తదితర 16 వేర్వేరు పన్నులను జిఎస్‌టిలో కలిపేశారు. దీనివల్ల రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతుండగా, జిఎస్‌టి అమలును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తొలి ఐదేళ్లు నష్టపరిహారం కూడా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే లగ్జరీ, ఆరోగ్యానికి హానికరం చేసే ఉత్పత్తులపై 43 శాతం వరకు పన్ను భారాన్ని మోపింది కేంద్రం. గరిష్ఠ పన్ను 28 శాతానికితోడు 15 శాతం అదనపు పన్ను వేస్తోంది.