బిజినెస్

నైనీ బొగ్గు బ్లాకులో 36 నెలల్లో ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/శ్రీరాంపూర్ రూరల్, మే 7: ఒడిశాలోని అంగూల్ జిల్లాలోగల నైనీ బొగ్గు బ్లాకులో ఉత్పత్తి 36 నెలల్లో ప్రారంభిస్తామని సింగరేణి సిఎండి ఎన్ శ్రీధర్ తెలిపారు. 450 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న నైనీ బొగ్గు గని సింగరేణికి వందలాది మైళ్ల దూరంలో ఉన్నందున దీన్ని ఎండిఓ పద్దతిలో నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించినట్లు చెప్పారు. బొగ్గును వెలికి తీసేందుకు ఈ నెలలో టెండర్లు పిలవనున్నామని స్పష్టం చేశారు. శనివారం నాడిక్కడ సింగరేణి భవన్‌లో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎండిఓ ఎంపిక కోసం ఆసక్తి ఉన్న కంపెనీలకు పిలుపునివ్వగా జనవరిలో దాదాపు 14 విదేశీ కంపెనీలు ఆసక్తి కనబరిచాయని వెల్లడించారు. కాగా, టెండర్ల ప్రక్రియకు సంబంధించిన సన్నాహాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఈ నెల 2వ వారంలో టెండర్లు పిలవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం కొత్త ప్రాజెక్టులను సమీక్షించారు. మరోవైపు ప్రతి ఏడాది 10 శాతం అభివృద్ధి సాధించాలనే ప్రణాళికలో భాగంగా సింగరేణి 2016-17లో ప్రారంభించాల్సి ఉన్న ఏడు కొత్త ప్రాజెక్టులపై, 2017-18లో ప్రారంభించాల్సి ఉన్న మరో 8 గనులు, ప్రాజెక్టులపై సిఎండి సమగ్రంగా చర్చించారు. కాగా, చైర్మన్ ఆదేశంపై ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు మనోహర్‌రావు బృందంతో కలసి నైనీ బొగ్గు బ్లాకులను సందర్శించారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్ రమేష్ కుమార్, మనోహర్ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్, అధికారులు అమర్‌నాథ్, నాగయ్య, నాగేశ్వర్‌రావు, కిషన్‌రావు, విజయరావు, ఆంథోని రాజ్ తదితరులు పాల్గొన్నారు.