బిజినెస్

త్రైమాసిక ఫలితాలపై ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్- జూన్)గాను వివిధ సంస్థలు వెల్లడించే ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు ఎలా? ఉందన్న దానిపైనా మదుపరులు దృష్టి పెట్టవచ్చని, దాని ఆధారంగా కూడా ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి పెట్టుబడులను తీసుకువచ్చే వీలుందని నిపుణులు పేర్కొంటున్నారు.
కాగా, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తోపాటు బజాజ్ ఆటో, ఎసిసి, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, కొటక్ మహీంద్ర బ్యాంక్ తదితర కీలక సంస్థలు ఈ వారం తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తున్నాయ. దీంతో లాభాలు భారీగా వస్తే స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయల్లో పరుగులు పెట్టడం ఖాయమన్న అభిప్రాయా లు పెద్దగా వినిపిస్తున్నాయ. కాగా, వర్ష సమాచారమూ కీలకమేనని చెబుతుండగా, సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలూ ముఖ్యమేనని నిపుణులు చెబుతున్నారు. రాష్టప్రతి ఎన్నిక జరగనుండటంతో అధికార బిజెపి అభ్యర్థి గెలుపుపై వచ్చే వార్తలు కూడా మార్కెట్లను నిలబెట్టడమా? పడగొట్టడమా అనే దాన్ని నిర్దేశిస్తాయని పేర్కొంటున్నారు.
మోదీ సర్కారు తమ అభ్యర్థినే రాష్టప్రతిగా గెలిపించుకుంటే మరిన్ని ఆర్థిక సంస్కరణలు ఖాయమన్న అంచనాలున్నాయ. దీంతో రాష్టప్రతి ఎన్నికలూ మార్కెట్లకు ప్రధానమే అయ్యాయ. కాగా, జిఎస్‌టిలో 5, 12, 18, 28 శ్లాబుల్లో వివిధ రంగాలకు చెందిన దాదాపు అన్ని వస్తువులకు కేంద్రం పన్ను రేట్లను నిర్ణయంచినది తెలిసిందే. అయతే అధిక పన్ను విధించారన్న భావనలో ఉన్న పలు రంగాలు తమపై పన్నుల భారాన్ని తగ్గించాలని ఆందోళన బాట పట్టాయ. దీంతో వీటన్నిటి ప్రభావం మదుపరుల పెట్టుబడు లపై ఉంటుందంటున్నారు మార్కెట్ విశే్లష కులు. కాగా, గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 660.12 పాయంట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 220.55 పాయంట్లు పెరిగాయ. సెనె్సక్స్ 32,020 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 9,886 వద్ద నిలిచింది. గత వారం స్టాక్ మార్కెట్లు నూతన శిఖరాలను అధిరోహించగా, మునుపెన్నడూ లేనివిధంగా సరికొత్త ఆల్‌టైమ్ హై రికార్డులను నెలకొల్పాయ. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం, టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు తగ్గుముఖం పట్టడం కూడా కలిసొచ్చిందని మార్కెట్ వర్గాలు విశే్లషిస్తున్నాయ. ఇదిలావుంటే ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.