బిజినెస్

9,900 స్థాయిని అధిగమించిన నిఫ్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 17: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం మరో సరికొత్త స్థాయిని చేరుకున్నాయి. అటు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ నూతన ఆల్‌టైమ్ హైని నెలకొల్పాయి. సెనె్సక్స్ 54.03 పాయింట్లు పెరిగి మునుపెన్నడూ లేనివిధంగా 32,074.78 వద్ద ముగియగా, నిఫ్టీ 29.60 పాయింట్లు అందుకుని, తొలిసారిగా 9,900 స్థాయికి ఎగువన 9,915.95 వద్ద నిలిచింది. దీంతో సెనె్సక్స్ గత రికార్డు 32,037.38 పాయింట్లు, నిఫ్టీ గత రికార్డు 9,891.70 పాయింట్ల స్థాయిలు కనుమరుగైపోయాయి.
కాగా, ఒకానొక దశలో సెనె్సక్స్ 32,131.92 పాయంట్లు, నిఫ్టీ 9,920.30 పాయంట్ల ఇంట్రా-డే రికార్డును నెలకొల్పాయ. రియల్టీ, మెటల్, ఐటి, టెక్నాలజీ రంగాల షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చాలావరకు సూచీలు లాభాల్లోనే కదలాడాయి. కాగా, సోమవారం ట్రేడింగ్‌లో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) మార్కెట్ విలువ సెనె్సక్స్‌లో 5 లక్షల కోట్ల రూపాయలను దాటింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) తర్వాత ఈ ఘనతను సాధించిన రెండో సంస్థగా ఆర్‌ఐఎల్ నిలిచింది. కాగా, ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువ 5,04,458.09 కోట్ల రూపాయల వద్ద ఉంది. ఇదిలావుంటే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్‌గా విక్రమ్ లిమయే సోమవారం బాధ్యతలు చేపట్టారు. రెగ్యులేటరీ సమస్యల పరిష్కారానికే తన తొలి ప్రాధన్యత అని స్పష్టం చేశారు. ప్రస్తుత కో-లొకేషన్ కేసుపై నెల రోజుల్లో ఫోరెన్సిక్ నివేదిక రావచ్చని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.