బిజినెస్

అమ్మకాల ఒత్తిడిలో మదుపరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 7: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో వారం నష్టాలకే పరిమితమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు మదుపరులను అమ్మకాల ఒత్తిడికి గురిచేశాయి. గడచిన ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చికిగాను ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 378.12 పాయింట్లు పతనమై 25,228.50 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 116.35 పాయింట్లు క్షీణించి 7,733.45 వద్ద స్థిరపడింది. ఇక గడచిన రెండు వారాల్లో సెనె్సక్స్ 609.64 పాయింట్లు దిగజారగా, నిఫ్టీ 165.85 పాయింట్లు పడిపోయింది. ఇక బిఎస్‌ఇ మిడ్-క్యాప్ సూచీ 0.70 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 1.10 శాతం నష్టపోయాయి. మెటల్, బ్యాంకింగ్, ఐటి, టెక్నాలజీ, పిఎస్‌యు, రియల్టీ, చమురు, గ్యాస్, ఆటో, ఎఫ్‌ఎమ్‌సిజి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్ల విలువ 3.60 శాతం నుంచి 0.39 శాతం తగ్గింది. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 11,976.50 కోట్ల రూపాయలుగా ఉంటే, ఎన్‌ఎస్‌ఇ 78,673.03 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 15,283.21 కోట్ల రూపాయలుగా ఉంది. ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ కూడా 94,953.22 కోట్ల రూపాయలుగా ఉంది.