బిజినెస్

స్క్రాంబ్లర్ డెజర్ట్ స్లెడ్‌ను ఆవిష్కరించిన డుకాటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: సూపర్ బైక్‌ల తయారీలో అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతి పొందిన ఇటాలియన్ సంస్థ డుకాటీ శనివారం భారత్‌లో స్క్రాంబ్లర్ డెజర్ట్ స్లెడ్ మోడల్ బైక్‌ను ఆవిష్కరించింది. న్యూఢిల్లీలో ఈ బైక్ ప్రారంభ ధరను రూ.9.32 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. దీనితో పాటు యూరో-4 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన స్క్రాంబ్లర్ ఐకాన్, స్క్రాంబ్లర్ క్లాసిక్ బైక్‌లను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఐకాన్ ధరను రూ.7.23 లక్షలు గానూ, క్లాసిక్ ధరను రూ.8.48 లక్షలు గానూ నిర్ణయించామని డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సెర్గీ కనోవాస్ గార్రిగా వెల్లడించారు. నగర ప్రాంతాలతో పాటు రోడ్లు సరిగా లేని ప్రాంతాల్లో ప్రయాణాలకు అనువుగా ఈ బైక్‌లను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. యూరో-4 ప్రమాణాలకు అనువుగా 803 సిసి సామర్ధ్యాన్ని కలిగివుంటే ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో రూపొందించిన డెజర్ట్ స్లెడ్ బైకు ఆరు గేర్లను కలిగి ఉండి, రెండు రంగుల్లో లభిస్తుందని, వీటిలో రెడ్ డస్క్ రంగు బైక్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.9.32 లక్షలుగానూ, వైట్ మిరేజ్ రంగు బైక్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.9.45 లక్షలుగానూ నిర్ణయించామని డుకాటీ ఇండియా సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. భారత మార్కెట్లో తాము ఆఫ్-రోడ్ కేటగిరీ బైక్‌లను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి అని, ఈ బైకుల కోసం బుకింగ్‌లను ప్రారంభించామని, దేశ వ్యాప్తంగా అన్ని డీలర్ల వద్ద ఈ బైక్‌లు లభ్యమవుతాయని గార్రిగా తెలిపారు.