బిజినెస్

ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో కేంద్రీయ తనిఖీ వ్యవస్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం వాణిజ్య సంస్కరణల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను వేగవంతం చేసేందుకు సెంట్రల్ ఇన్‌స్పెక్షన్ సిస్టమ్ (కేంద్రియ తనిఖీ వ్యవస్ధ) అమలు చేసేందుకు పలు అంశాలను వివరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ పలు ఇతర శాఖలతో సంప్రదించిన అనంతరం ఈ జివో జారీ చేసింది. కార్మిక, ఫ్యాక్టరీ, బాయిలర్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తదితర శాఖల అధికారులంతా సంయుక్తంగా తనిఖీలు చేయాలని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో తనిఖీల షెడ్యూల్‌ను ఖరారు చేయడం, కంప్యూరైజ్డ్ రిస్క్ అసెస్‌మెంట్‌ను వినియోగించి వ్యాపార సంస్థలను తనిఖీలు చేయడం వంటివి చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.