బిజినెస్

రిలయన్స్ లాభాలు 28 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కార్పొరేట్ దిగ్గజం రిలయెన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం 28 శాతం పెరిగి రూ. 9,108 కోట్లకు చేరుకొంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం 7,113 కోట్లు కాగా, అది ఇప్పుడు 28 శాతం పెరిగి రూ. 9,108 కోట్లకు చేరుకొందని రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. లాభాల్లో అధిక శాతం రిఫైనరీ, పెట్రోకెమికల్స్ రంగాలనుంచే లభించిందని, ఆ ప్రకటన తెలిపింది. అలాగే గల్ఫ్ ఆఫ్రికా పెట్రోలియం కార్పొరేషన్‌లో వాటా విక్రయించడం వల్ల ఏకమొత్తంగా రూ. 1,087 కోట్లు లభించడం కూడా నికర లాభాలు పెరగడానికి ప్రదాన కారణమని సంస్థ ఆ ప్రకటనలో తెలిపింది. కాగా, ఇదే సమయంలో కంపెనీ రెవిన్యూ 26.7 శాతం పెరిగి రూ.90,537 కోట్లకు చేరుకున్నట్లు ఆ ప్రకటన తెలిపింది. ప్రధానంగా రిఫైనింగ్, పెట్రోకెమికల్ ఉత్పత్తుల ధరలతో పాటుగా విక్రయాలు కూడా పెరగడం దీనికి కారణం కాగా, చమురు, గ్యాస్ అనే్వషణ, ఉత్పత్తుల వ్యాపారంలో క్షీణత కారణంగా రెవిన్యూ పెరుగుదల కొంతమేరకు పరిమితమైందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆ ప్రకటనలో తెలిపింది. రిటైల్ వ్యాపారం గణనీయంగా 73.6 శాతం పెరిగి రూ 11,571 కోట్లకు చేరుకొంది. కాగా, ఈ ఏడాది జూన్ 30 నాటికి కంపెనీ రుణాలు రూ.2,00,674 కోట్లకు పెరిగాయి. గత మార్చి 31 నాటికి ఈ రుణాలు 1,96, 601 కోట్లు మాత్రమే. కాగా, చేతిలో నగదు సైతం మార్చి 31 నాటికి ఉన్న రూ 77,226 కోట్లనుంచి జూన్ 30 నాటికి రూ 72,107 కోట్లకు తగ్గిపోయింది.
అయితే రిలయన్స్ తన ప్రకటనలో గత ఏడాది సెప్టెంబర్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన టెలికాం సంస్థ రిలయన్స్ జియో గురించి పెద్దగా వివరాలు తెలియజేయలేదు. అయితే కేవలం 170 రోజుల్లోనే 10 కోట్ల చందాదారులతో రిలయెన్స్ జియో ప్రపంచంలోనే శరవేగంగా ఎదుగుతున్న కంపెనీగా అవతరించిందని మాత్రం తెలిపింది. కాగా, ముంబయిలో శనివారం జరిగే కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయెన్స్ జియోకు సంబంధించి మరిన్ని ప్రకటనలు వెలువడే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.
రూ.398 కోట్లకు పెరిగిన రిలయెన్స్ రిటైల్ లాభం
ఇదిలా ఉండగా రిలయెన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగమైన రిలయెన్స్ రిటైల్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ పన్నుకు ముందు లాభాలు ఏకంగా 65.8 శాతం పెరిగి రూ 398 కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ పన్నుకు ముందు లాభాలు రూ 240 కోట్లు మాత్రమే. అలాగే ప్రస్తుత ఆర్తిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ టర్నోవర్ సైతం గత ఏడాదితో పోలిస్తే 73.6 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ టర్నోవర్ రూ. 6,666 కోట్లు కాగా, ఇప్పుడది రూ. 11,571 కోట్లకు పెరిగింది. కాగా, ఈ త్రైమాసికంలో కంపెనీ దేశవ్యాప్తంగా కొత్తగా మరో 18 రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 703 నగరాల్లో 3,634 రిలయన్స్ రిటైల్ స్టోర్లున్నాయి.
రూ.20 వేల కోట్ల రైట్స్ ఇష్యూ
ఇదిలా ఉండగా రిలయెన్స్ జియో తన నిధుల అవసరాలను తీర్చుకోవడం కోసం రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 20 వేల కోట్లను సేకరించాలని అనుకొంటోంది. నలభై కోట్ల ఆప్షనల్లీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లను రైట్స్ ఇష్యూలో విక్రయించడం ద్వారా రూ 20 వేల కోట్లను సమీకరించాలని గురువారం(జూలై 20న) జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు రిలయెన్స్ జియో సెబీకి దాఖలు చేసిన ఒక నివేదికలో తెలియజేసింది.