బిజినెస్

రూ.11 వేల కోట్ల విప్రో బైబ్యాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 20: దేశంలో మూడవ అతిపెద్ద ఐటి సంస్థ అయిన విప్రో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంచనాలను మించి వృద్ధి సాధించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ప్రాతిపదికన రూ. 2076.7 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో రూ.2052 కోట్లుగా నమోదై కంపెనీ నికర లాభంతో పోలిస్తే ఇది 1.2 శాతం ఎక్కువ. మరో వైపు కంపెనీ ఒక్కో షేరు రూ. 320 చొప్పున రూ. 11 వేలకోట్ల విలువైన 34.3 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు ప్రకటించింది. ‘ఒక్కోటి 2 రూపాయల ముఖ విలువ కలిగిన 34.375 కోట్ల షేర్లను కొనుగోలు చేయడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. అయితే కంపెనీ షేర్‌హోల్టర్లు పోస్టల్ బ్యాలెఠ్ద్వారా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపాల్సి ఉంది’ అని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. బై బ్యాక్ షేరు ధర ఒక్కో షేరుకు రూ. 320గా ఉంటుందని కూడా ఆ ప్రకటన తెలిపింది. ఇదిలా ఉండగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ రెవిన్యూ సైతం స్వల్పంగా పెరిగి రూ. 14, 281.4 కోట్లకు చేరుకుంది.
అంచనాల పైస్థాయిలో రెవిన్యూలను తాము సాధించగలిగామని విప్రో సిఈఓ అబిదాలి జడ్ నీముచ్‌వాలా తెలిపారు. బలమైన వ్యాపార సామర్థ్యాన్ని ప్రదర్శించినప్పటికీ డాలరుతో రూపాయి బలంగా ఉండడం, వేతనాల పెరుగుదల కారణంగా కంపెనీ రెవిన్యూపై కొంత ఒత్తిడి వచ్చిందని విప్రో చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ జతిన్ దలాల్ చెప్పారు. కంపెనీ ఈ త్రైమాసికంలో ఐటి సేవల ద్వారా 7 శాతం వృద్ధిని నమోదు చేసి రూ 630 కోట్లు ఆర్జించింది. కాగా, ఈ త్రైమాసికంలో కంపెనీ కొత్తగా 1309 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,66, 790కి చేరుకున్నట్లు కూడా సంస్థ ఆ ప్రకటనలో తెలిపింది. కాగా, సామర్థ్యం ఫలాలను వాటాదారులకు అందజేయాలన్న కంపెనీ ఫిలాసఫీలో భాగంగానే షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించినట్లు దలాల్ తెలిపారు.

చిత్రం.. విప్రో తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్న ఆ సంస్థ సిఈఓ అబిదాలి జడ్ నీముచ్‌వాలా