క్రీడాభూమి

రోహిత్, రాహుల్‌పై ఫోకస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జూలై 20: శ్రీలంక టూర్‌ను టీమిండియా శుక్రవారం మొదలయ్యే రెండు రోజుల వామప్ మ్యాచ్‌తో మొదలుపెట్టనుంది. శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్‌పై కేంద్రీకృతమైంది. వీరిద్దరూ గాయాల కారణంగా కొంతకాలం విశ్రాంతి తీసుకొని, మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లకు సిద్ధమయ్యారు. వీరి ఫిట్నెస్ స్థాయిపై జట్టు మేనేజ్‌మెంట్ ఒక నిర్ణయానికి వచ్చేందుకు కూడా రెండు రోజుల వామప్ మ్యాచ్ ఉపయోగపడనుంది. నిరుడు అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ఇప్పటి వరకూ ఒక్క టెస్టు కూడా ఆడలేదు. గాయం కారణంగా అతను ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లతో స్వదేశంతో జరిగిన టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు. మోకాలికి శస్త్ర చికిత్స చేయించకున్న తర్వాత కూడా అతను ఫస్ట్‌క్లాస్ ఆమ్యచ్‌లు ఆడకపోవడం గమనార్హం. అయితే, ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతను ముంబయి ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి, జట్టును విజయపథంలో నడిపాడు. మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన అతను 333 పరుగులు సాధించాడు. ఐపిఎల్‌లో రాణించడంతో అతనికి మళ్లీ జాతీయ జట్టులో స్థానం దక్కింది.
ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో, ఏడు ఇన్నింగ్స్ ఆడి, ఆరు అర్ధ శతకాలను సాధించిన రాహుల్ ఆతర్వాత భుజం గాయంతో ఆసుపత్రిపాలయ్యాడు. భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న కారణంగా ఐపిఎల్, చాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ సిరీస్‌కు అతను దూరమయ్యాడు. అతను పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నాడా? లేదా? అన్నది కూడా ఈ సిరీస్‌లో స్పష్టమవుతుంది. అటు రోహిత్‌కు, ఇటు రాహుల్‌కు వామప్ మ్యాచ్ ద్వారా బ్యాటింగ్ ప్రాక్టీస్ లభిస్తుంది.
ఇలావుంటే, కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన రవి శాస్ర్తీకి ఇది తొలి పరీక్ష. ఇంతకు ముందు అతను టీమిండియాకు డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉన్నప్పటికీ, కోచ్ పదవి అతనికి కొత్తే. కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాలు ఉన్న కారణంగానే కోచ్‌గా అనిల్ కుంబ్లే కాంట్రాక్టును పొడిగించలేదన్న విమర్శలున్నాయి. ఒక రకంగా కోహ్లీ, అతని సహచరులు కుంబ్లేను సాగనంపడం ద్వారా తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. కెప్టెన్‌తో రవి శాస్ర్తీకి ఎలాంటి విభేదాలు లేకపోయినప్పటికీ, రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య సయోధ్య ఏ విధంగా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అంతేగాక, ఆటగాళ్ల నైపుణ్యాన్ని అతను ఏ విధంగా ఉపయోగించుకుంటాడో చూడాలి.
శ్రీలంకతో మ్యాచ్‌లకు జట్టు కూర్పు ఏ విధంగా ఉండాలనే విషయాన్ని అధ్యయనం చేయడానికి కెప్టెన్ కోహ్లీకి వామప్ మ్యాచ్ ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి, మళ్లీ జట్టులోకి వచ్చిన పేసర్లు ఇశాంత్ శర్మ, మహమ్మద్ షమీ ఫామ్‌ను అంచనా వేసే వీలు కలుగుతుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు భుజం గాయం కారణంగా దూరమైన హార్దిక్ పాండ్య ఆతర్వాత ఐపిఎల్‌లో అద్భుతంగా ఆడాడు. మరో పేసర్ ఉమేష్ యాదవ్ కూడా దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్నారు. దీనితో తుది జట్టులో ఎవరు ఉండాలనే విషయంపై కోహ్లీ ఒక అవగాహనకు రావాలంటే, వామప్ మ్యాచ్‌లో వారు రాణించే తీరే కీలకమవుతుంది. శ్రీలంకలో పిచ్‌లు పేసర్ల కంటే స్పిన్నర్లకు ఎక్కువగా ఉపయోగపడతాయన్నది వాస్తవం. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుంటే, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల్లో ఎవరిని టెస్టుల్లో ఆడించాలనే విషయంలోనూ కోహ్లీ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద జట్టులోని ఆటగాళ్ల ఫిట్నెస్, ఫామ్ వంటి అంశాలపై కోచ్, కెప్టెన్ ఒక అవగాహనకు వచ్చేందుకు రెండు రోజుల వామప్ మ్యాచ్ ఉపయోగపడుతుంది.