బిజినెస్

2018 మార్చికల్లా ఆంధ్ర, తెలంగాణలో 4జి సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: వచ్చే ఏడాది మార్చికల్లా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 4జి సేవలను అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, 1,150 వరకు 4జి సైట్స్‌ను నెలకొల్పనున్నట్లు బిఎన్‌ఎన్‌ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజన్ ఎల్ అనంతరామ్ ప్రకటించారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఎస్‌ఎన్‌ఎల్ నుంచి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే 4జి సేవల నిర్మాణ పనులు చేపడుతామన్నారు. కాగా, దేశం మొత్తం మీద 4జి కోసం పదివేల సైట్లను ఎంపిక చేశారు. అందులో తెలంగాణకు 550 సైట్లు, ఆంధ్రాకు 600 సైట్లను కేటాయించారని ఆయన చెప్పారు. మరోవైపు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 4,27,209 సిమ్‌లు యాక్టివేట్ అయినట్లు చెప్పారు. ఇకపోతే రెండు రాష్ట్రాల్లో గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో రూ. 2,500 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ 4జి ప్లస్ కింద వైఫై సర్వీసులు తెలంగాణలో ప్రారంభించామన్నారు. మొదటి దశలో 63 లొకేషన్లలో వైఫై సేవలు ప్రారంభించారు. ఇందులో 11 రూరల్ ఎక్స్ఛేంజీలు ఉన్నాయన్నారు. వచ్చే నెలాఖరు నాటికి మరో 58 లొకేషన్స్‌లో ప్రారంభిస్తామన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ఐఐటిలో ర్యాంకు వచ్చిన కార్తీక్, ఎమ్సెట్‌లో ర్యాంకు సాధించిన సాయిసుమంత్‌లకు సిమ్ కార్డులను అందజేశారు.

చిత్రం.. శుక్రవారం హైదరాబాద్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న బిఎన్‌ఎన్‌ఎల్ తెలంగాణ సర్కిల్ సిజిఎం అనంతరామ్