బిజినెస్

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 21: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 124.49 పాయింట్లు పెరిగి 32,028.89 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 41.95 పాయింట్లు అందుకుని 9,915.25 వద్ద నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ విలువ బిఎస్‌ఇలో 3.76 శాతం, ఎన్‌ఎస్‌ఇలో 4.15 శాతం ఎగబాకింది. దీంతో సంస్థ మార్కెట్ విలువ 5,15,790.39 కోట్ల రూపాయలకు చేరింది. అలాగే విప్రో షేర్ విలువ బిఎస్‌ఇలో 6.47 శాతం, ఎన్‌ఎస్‌ఇలో 8.17 శాతం ఎగిసింది. దీంతో సంస్థ మార్కెట్ విలువ 1,39,373.83 కోట్ల రూపాయలను తాకింది. రిలయన్స్ త్రైమాసిక లాభం మదుపరులను ఆకట్టుకోవడంతో రిలయన్స్ షేర్ విలువ పెరగగా, విప్రో మెగా బైబ్యాక్ షేర్ ఆఫర్ ప్రకటనతో విప్రో షేర్ విలువ ఎగిసింది.