బిజినెస్

మెగా డెయిరీగా ‘విజయ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: తెలంగాణ ప్రభుత్వ అధీనంలోని ‘విజయ’ డెయిరీని 300 కోట్ల రూపాయల పెట్టుబడితో మెగా డెయిరీగా విస్తరిస్తామని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. విజయ డెయిరీపై శనివారం ఆయన లాలాపేటలోని డెయిరీ ప్రధాన కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయ డెయిరీపట్ల ప్రజల్లో సంతృప్తి, నమ్మకం ఉన్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం రోజూ ఐదు లక్షల లీటర్ల పాల సామర్థ్యం కలిగిన విజయ డెయిరీని మరో ఐదు లక్షల లీటర్ల సామర్థ్యంగల యూనిట్‌గా విస్తరిస్తామని, దాంతో రోజూ 10 లక్షల లీటర్ల పాల సామర్థ్యం సమకూరుతుందన్నారు. విస్తరణకు కొత్త యంత్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం ఉన్న లాలాపేట విజయ డెయిరీ స్థలం సరిపోదని, అందువల్ల శామీర్‌పేటలో 100 ఎకరాల స్థలం కేటాయిస్తామన్నారు. కాగా, విజయ పాలు, పాల ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉండటం వల్ల దీనికి మార్కెటింగ్‌ను విస్తృత పరుచుకోవాలని, హైదరాబాద్‌లో ప్రత్యేకంగా హోర్డింగ్‌లను ఏర్పాటు చేయాలని మంత్రి తలసాని సూచించారు. ఏజంట్లకు ఇస్తున్న కమిషన్‌ను పెంచడం వల్ల మార్కెటింగ్ మరింత బలపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాల్లో డెయిరీ ఔట్‌లెట్‌లను ఏర్పాటు చేసుకోవడం వల్ల సత్ఫలితాలు వస్తాయన్న మంత్రి తలసాని.. మార్కెటింగ్‌ను ఏ విధంగా పెంచుకోవాలో అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరోవైపు డెయిరీ పరిధిలో ఉన్న 110 ఉద్యోగ ఖాళీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలావుంటే పాల సేకరణ, సరఫరాకు ప్రైవేట్ వాహనాలను ఉపయోగించడం మానివేసి, సొంత వాహనాలను సమకూర్చుకోవాలన్నారు.
ఈ సమావేశంలో విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా, విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. విజయ డెయరీపై సమీక్షలో మంత్రి తలసాని తదితరులు