బిజినెస్

అర్బన్ మొబిలిటీ ఇండియా సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: జాతీయ స్థాయి వేడుక, 10వ అర్బన్ మొబిలిటీ ఇండియా (యుఎంఐ) సమావేశం ప్రదర్శనకు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ ఏడాది నవంబర్ 4 నుంచి హైదరాబాద్ నగరంలో మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ఇప్పటి నుంచే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ సచివాలంలో శనివారం ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి క్రిష్టినా జోగ్తు, టిఎస్‌ఆర్టీసి ఈడి, తదితర అధికారులు హాజరయ్యారు. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా మిట్టల్ మాట్లాడుతూ మెట్రో రైల్ ఎండి ఈ ఏర్పాట్లు మొత్తానికి నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. రానున్న రోజుల్లో సమర్థవంతమైన రవాణా వ్యవస్థను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నగర రవాణా వ్యవస్థపై నిపుణులు అనేక సలహాలు, సూచనలు చేస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు కెటిఆర్, మహేందర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి విచ్చేస్తారని చెప్పారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలు, సంస్థల నుంచి 1,500 ప్రతినిధులు హాజరవుతారని స్పష్టం చేశారు. ఈ ప్రదర్శనలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న అర్బన్ మొబిలిటీకి సంబంధించిన వాటిని ప్రదర్శిస్తారని తెలిపారు. పర్యాటక శాఖ అధికారులు ఈ సమావేశానికి విచ్చేసే ప్రతినిధులకు అవసరమైన బస, ఇతర సౌకర్యాలను కల్పించాలని కోరారు. అలాగే హోటల్స్ నుంచి సమావేశ వేదిక వరకు ప్రతినిధులను తీసుకు వచ్చేందుకు వీలుగా ఆర్టీసి తగిన బస్సు సౌకర్యాలను కల్పించాలని కూడా స్పష్టం చేశారు. ఐటి శాఖ.. సమావేశ వేదిక వద్ద ఉచితంగా వైఫై సేవలను అందిస్తుందని తెలిపారు.