బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఇండియన్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 21.16 శాతం పెరిగి 372.40 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 307.35 కోట్ల రూపాయలుగా ఉందని తెలిపింది. ఆదాయం ఈసారి 4,788.04 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 4,512.96 కోట్ల రూపాయలుగా ఉందని ఇండియన్ బ్యాంక్ స్పష్టం చేసింది.
డిహెచ్‌ఎఫ్‌ఎల్
డిహెచ్‌ఎఫ్‌ఎల్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 29 శాతం పెరిగి 260 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 201.4 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 2,408 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 1,956 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
విజయా బ్యాంక్
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ విజయా బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 57.5 శాతం పెరిగి 254.69 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 161.66 కోట్ల రూపాయలుగా ఉందని బ్యంక్ తెలియజేసింది. ఇక ఆదాయం ఈసారి 3,510.11 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 3,295.05 కోట్ల రూపాయలుగా ఉందని బ్యాంక్ వెల్లడించింది.
ఐఐఎఫ్‌ఎల్
ఆర్థిక సేవల సంస్థ ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్స్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 44 శాతం పెరిగి 198.1 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 137.5 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 1,478.46 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 1,030.54 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలియజేసింది.
దివిస్ ల్యాబ్స్
ఔషధరంగ సంస్థ దివిస్ ల్యాబ్స్ స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 41.50 శాతం ఎగిసి 176.54 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్- జూన్‌లో ఇది 301.81 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 850.88 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 1,033.50 కోట్ల రూపాయలుగా ఉంది.
డి-మార్ట్
సూపర్ మార్కెటింగ్ సంస్థ డి-మార్ట్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 47.6 శాతం పెరిగి 174.77 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 118.44 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 3,598.13 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 2,652.39 కోట్ల రూపాయలుగా ఉంది.
అశోక్ లేలాండ్
ఆటో రంగ సంస్థ అశోక్ లేలాండ్ స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 111.23 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 290.78 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 4,552.79 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 4,569.84 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలియజేసింది.
టాటా స్పాంజ్ ఐరన్
టాటా స్పాంజ్ ఐరన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 30.5 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 10.5 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 201.7 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 128.5 కోట్ల రూపాయలుగా ఉంది.
జమ్మూకాశ్మీర్ బ్యాంక్
జమ్మూకాశ్మీర్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 32 శాతం పెరిగి 30.19 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 22.88 కోట్ల రూపాయలుగా ఉందని జమ్మూకాశ్మీర్ బ్యాంక్ వర్గాలు స్పష్టం చేశాయ. ఇక ఆదాయం ఈసారి 1,790.53 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయనసారి 1,789.05 కోట్ల రూపాయలుగా ఉందని బ్యాంక్ వెల్లడించింది.