బిజినెస్

పన్ను ఎగవేతలను అరికడుతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: పాత పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నిర్ణయాలతో నగదు లావాదేవీలు కష్టతరమైపోయాయని, పన్ను ఎగవేతలకూ ఇక అవకాశం లేకుండా పోయిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. దేశంలోని అక్రమార్కులు విదేశాల్లో దాచుకున్న తమ అవినీతి సంపాదనను తిరిగి దేశంలోకి తీసుకురావడానికి వీలుగా చట్టాలను తెస్తున్నామని, ఇదే సమయంలో దేశంలో దాగి ఉన్న నల్లధనాన్నీ వెలికితీసే చర్యలను ముమ్మరం చేశామని, డొల్ల కంపెనీల భరతం పడుతున్నామని స్పష్టం చేశారు. దేశంలో చాలామంది పన్ను ఎగవేతదారులున్నారన్న జైట్లీ.. ఆ అక్రమ సంపదతో చట్ట, న్యాయ వ్యవస్థలను దాటి పెద్ద ఎత్తున లావాదేవీలు జరుపుతున్నారన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తీవ్రం గా ప్రయత్నిస్తున్నామన్న ఆయన ప్రతి యేటా ఆర్థిక బిల్లు ద్వారా కొన్ని మార్పులను ప్రకటిస్తూనే ఉన్నామని, అయితే అవి కొంతమేరే ప్రభావం చూపుతున్నాయన్నారు. శనివారం ఇక్కడ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఢిల్లీ ఎకనామిక్స్ కంక్లేవ్‌లో పాల్గొన్న జైట్లీ.. తమ ప్రభుత్వం తీసుకుంటున్న సాహసోపేత సంస్కరణలను వివరించారు. ఈ నెల ప్రథమార్ధం వరకు 1.62 లక్షలకుపైగా డొల్ల కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు శుక్రవారం జైట్లీ లోక్‌సభలో చెప్పినది తెలిసిందే. మరోవైపు ఎలక్టోరల్ బాండ్ మెకానిజంపై ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోందని జైట్లీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినది తెలిసిందే. 500, 1,000 రూపాయల నోట్ల చలామణిని నిలిపివేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. కొత్తగా 500, 2,000 రూపాయల నోట్లనూ పరిచయం చేశారు. అయితే తొలుత 500 రూపాయల నోట్లు అందుబాటులోకి రాకపోవడం, కేవలం 2,000 రూపాయల నోట్లే రావడం, అదికూడా అరకొరగా లభించడంతో నగదు కొరత సమస్య వచ్చిపడింది. ముఖ్యంగా 100 రూపాయల నోట్లు లేక చిల్లర కష్టాలు తలెత్తాయి. దీంతో అన్ని వ్యాపార లావాదేవీలు ఒక్కసారిగా పడిపోగా, డిజిటల్ ఎకానమీని తలకెత్తుకుంది మోదీ సర్కారు. ఇందుకు ప్రోత్సాహకాలనూ కల్పించింది. అలాగే ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను నినాదంతో దేశవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి జిఎస్‌టి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరోక్ష పన్నుల విధానంలో 1,200లకుపైగా వస్తువులు, 500ల సేవలకు కలిపి నాలుగు శ్లాబుల్లో పన్ను రేట్లను నిర్ణయించారు. 5, 12, 18, 28 రేట్లలో ఈ పన్నులను వేయగా, బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం పన్నును విధించారు. విద్య, వైద్యం, తాజా కూరగాయలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ తదితర 16 వేర్వేరు పన్నులను జిఎస్‌టిలో కలిపేశారు. దీనివల్ల రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతుండగా, జిఎస్‌టి అమలును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తొలి ఐదేళ్లు నష్టపరిహారం కూడా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే లగ్జరీ, ఆరోగ్యానికి హానికరం చేసే ఉత్పత్తు లపై గరిష్ఠ పన్ను 28 శాతంతోపాటు అదనంగా మరో 15 శాతం పన్ను వేసి మొత్తం 43 శాతం వరకు పన్ను భారాన్ని మోపింది మోదీ సర్కారు.
జిఎస్‌టిలోకి మారండి
అహ్మదాబాద్: జిఎస్‌టిలోకి మారడం ద్వారా వ్యాపారులు ఓ చారిత్రక సంస్కరణలో భాగస్వాము లు కావాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరాని పిలుపునిచ్చారు. జిఎస్‌టిని గొప్ప పారదర్శక నిర్ణయంగా పేర్కొన్న మంత్రి.. అది కేవలం గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ కాదని, ట్రాన్స్‌ఫార్మేషన్‌కు చక్కని ముందడు గంటూ అభివర్ణించారు. శనివారం ఇక్కడ జిఎస్‌టిపై జరిగిన వేడుకలో వ్యాపారవేత్తలనుద్దేశించి ఇరాని మాట్లాడారు. జిఎస్‌టిపై నెలకొన్న అపోహాలపట్ల కూడా మంత్రి తనదైన శైలిలో స్పందించారు. జిఎస్‌టికి ముందు వినియోగదారులు ఏయే పన్నులు చెల్లించారో? వారికి తెలుసా? అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఆ పన్నులన్నింటిని తొలగించి ఒకే పన్నును తెచ్చామని, అదికూడా కీలక మైన ఎన్నో ఉత్పత్తులపై తగ్గించామని, సామాన్యులపై భారం తొలగించా మన్నారు.