బిజినెస్

కోరమాండల్‌కు పర్యావరణ అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: దేశీయ రెండో అతిపెద్ద ఫాస్ఫటిక్ ఫర్టిలైజర్ తయారీదారు కోరమాండల్ ఇంటర్నేషనల్.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వద్దగల తమ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు కావాల్సిన పర్యావరణ అనుమతులను పొందింది. వైజాగ్‌లోని శ్రీహరిపురం ప్లాంట్ విస్తరణకు కోరమాండల్ 225 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ఫాస్ఫరిక్ యాసిడ్ రోజువారి ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుత 700 టన్నుల నుంచి 1,000 టన్నులకు పెంచాలని చూస్తోంది. అలాగే రోజువారి కాంప్లెక్స్ ఎరువుల ఉత్పత్తిని 3,900 టన్నులకు పెంచాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కాకినాడల్లో, తమిళనాడులోని ఎన్నోర్, రాణీపేట్‌లలో కోరమాండల్‌కు ఫాస్ఫటిక్ ఫర్టిలైజర్ ప్లాంట్లున్నాయి.