బిజినెస్

త్రైమాసిక ఫలితాలే దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్- జూన్)గాను వివిధ సంస్థలు వెల్లడించే ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు ఎలా? ఉందన్న దానిపైనా మదుపరులు దృష్టి పెట్టవచ్చని, దాని ఆధారంగా కూడా ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి పెట్టుబడులను తీసుకువచ్చే వీలుందని నిపుణులు పేర్కొంటు న్నారు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ సమావేశం కూడా కీలకమేనని చెబుతున్నారు. మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు ఈ సమావేశం జరుగుతుంది.
ఈ వారం ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, మారుతి సుజుకి, ఒఎన్‌జిసి, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తదితర సంస్థలు తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయ. దీంతో మదుపరుల పెట్టుబడులను ఇవి ప్రభావితం చేస్తాయన్న అంచనాను ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా వెలిబుచ్చారు. దీంతో లాభాలు భారీగా వస్తే స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయల్లో పరుగులు పెట్టడం ఖాయమన్న అభిప్రాయాలు పెద్దగా వినిపిస్తున్నాయ. గత వారం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్లను అధికంగా ప్రభావితం చేసినది తెలిసిందే.
అయతే అగ్రశ్రేణి సంస్థలు త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తుండటంతో మార్కెట్లు కొంతవరకు ఒడిదుడుకులకు కూడా లోను కావచ్చని ఆమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్స్ డైరెక్టర్ అండ్ రిసెర్చ్ అధిపతి అభ్నిశ్ కుమార్ సుధాంశు అన్నారు. లాభాలు ఆశించిన స్థాయలో లేనిపక్షంలో మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకు దిగవచ్చని సుధాంశు పేర్కొన్నారు.
మరోవైపు వర్ష సమాచారమూ ముఖ్యమే నని అంటు న్నారు. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కుండపోతగా పడుతున్నది తెలిసిందే. ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలుండ టంతో ప్రధాన నదులన్నింటికీ వరదలు వస్తున్నాయ. ఫలితంగా దేశీయ వ్యవసాయం ముఖ్యంగా వర్షాధారం కావడంతో ఈసారి పంటలు బాగా పండు తాయన్న అంచనా లున్నాయ. ఇక గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ కేవలం 8.14 పాయంట్లు పెరగగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 28.90 పాయంట్లు పెరిగింది. సెనె్సక్స్ 32,028 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 9,915 వద్ద నిలిచింది. గత వారం స్టాక్ మార్కెట్లు నూతన శిఖరాలను అధిరోహించగా, మునుపె న్నడూ లేనివిధంగా సరికొత్త ఆల్‌టైమ్ హై రికార్డులను సూచీలు నెలకొల్పాయ.
ఇదిలావుంటే ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయను న్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.