బిజినెస్

సంక్షోభంలో నిర్మాణ రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 24: పాత పెద్ద నోట్ల రద్దు, కొత్త నిబంధనలు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి), రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల, తదితర కారణాలతో భవన నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. నవ్యాంధ్ర రాజధాని విషయానికే వస్తే.. పాత ప్రాజెక్ట్‌లు మినహా కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభించేందుకు బిల్డర్లు వెనుకాడుతున్నారు. విజయవాడ నగర పరిసరాల్లోనే దాదాపు చిన్నా, పెద్ద బిల్డర్లు వెయ్యి మంది వరకు ఈ ప్రభావానికి లోనయ్యారు. దీంతో ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ దాదాపు లక్ష మందికిపైగా ఉపాధి లేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఏనాడో అడ్వాన్స్‌లతో కొనసాగిన భారీ ప్రాజెక్టుల నిర్మాణాలూ ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో నిర్మాణ రంగ కూలీలకు పనే కరువవుతోంది. కాగా, దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన బిల్డింగ్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం కూడా ఈ సంక్షోభానికి ఒక కారణంగా కనిపిస్తోంది. దీని ప్రకారం అడ్వాన్స్‌గా కస్టమర్స్ నుంచి తీసుకునే సొమ్ములో 70 శాతాన్ని ఆ ప్రాజెక్ట్ కోసమే ఖర్చు చేయాల్సి ఉంది. ఈ సొమ్మును ఇతరత్రా ప్రాజెక్టులకు తరలించే అవకాశం లేదు. ఏదైనా లోపం జరిగితే బిల్డర్ కనీసం మూడేళ్లపాటు జైలుశిక్షకు గురికావాల్సి ఉంది. పైగా ఐదేళ్లపాటు ఆ అపార్ట్‌మెంట్ నిర్వహణ బాధ్యత కూడా భరించాల్సి ఉంది. ఇక సిమెంట్ బస్తా ధర 230 రూపాయల నుంచి ఏకంగా 390 రూపాయ లకు పెరిగింది. ఈ ధరల నియంత్రణ కోసం ముగ్గురు మంత్రులతో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం మూడు మాసాలైనప్పటికీ ఎలాంటి చర్య లేదు. ఇక లారీ ఇసుక ధర 3 వేల నుంచి 6 వేల రూపాయలకు పెరిగింది. దీనిపై కూడా ఎలాంటి నియంత్రణ లేదు. దీంతో హైదరాబాద్ నుంచి తరలివచ్చిన దాదాపు 10 వేల కుటుంబాలకు విజయవాడ నగరంలో గృహ వసతి గగన కుసుమంగా మారింది. నూతన గృహాల ధరలు, ఇంటి అద్దెలు ఏటేటా అనూహ్యంగా పెరుగుతుంటే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు గృహ వసతి కరువైంది.
బందరు రోడ్డులోగల ఐదంతస్తుల అపార్ట్‌మెంట్ సముదాయంలో 3,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ మూడు నుంచి మూడున్నర కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇందులో స్విమ్మింగ్ పూల్స్‌తోపాటు ఇతరత్రా అన్ని రకాల వౌలిక సదుపాయాలున్నా యి. ఇప్పటికే పలువురు మంత్రులు ఇక్కడ కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. ఇక పిన్నమనేని పాలీక్లినిక్ వీధిలో 15 అంతస్తుల్లో త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లతో నిండిన భారీ కట్టడాల నిర్మాణం జరుగుతోంది. వారధి సమీపంలోనూ భారీ కట్టడాల నిర్మాణాలున్నాయ. వీటి ధర కోటి రూపాయల నుంచి కోటిన్నర వరకు పలుకుతున్నది. రాజధాని ప్రాంతంలో ఎకరం భూమిని రెండు కోట్ల రూపాయల వరకు రైతులు అమ్మినట్లు తెలుస్తోంది మరి.
ఆగస్ట్ 1 నుంచి రిజిస్ట్రేషన్ బాదుడు
ఇదిలాఉండగా ఆగస్టు ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ బాదుడు ప్రారంభం కానుంది. ప్లాట్ కొనుగోలుపై పన్ను రేట్లు, రిజిస్ట్రేషన్ చార్జీలు, ఆస్తి విలువలు ఇలా వరుసగా పెరగటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల కలగానే మిగిలిపోనున్నది. ఈ నెల ఒకటో తేదీ నుంచి అన్నింటిపై జిఎస్‌టి బాదుడు పెరిగింది. దీనికితోడు పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీ వల్ల ఫ్లాట్‌కు పన్ను 81 వేల నుంచి రెండున్నర లక్షల రూపాయలకు పెరగనున్నది.
వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత గత మూడేళ్లుగా అపార్ట్‌మెంట్ల నిర్మాణంలో వేగం పెరిగింది. విజయవాడలోని పలు ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులున్న డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లను 40 లక్షల రూపాయల వరకు విక్రయిస్తున్నారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం చదరపు అడుగుకు 960 రూపాయల చొప్పున 9.60 లక్షల రూపాయల విలువ చూపాలి. ఇక ఆ అపార్ట్‌మెంట్ స్థలానికి వివిధ ప్రాంతాల్లో గజానికి 8 వేలు నుంచి 10 వేల రూపాయల వరకు చార్జీ ఉంది.
ఒక ఫ్లాటుకు సెల్లార్‌లో 30 నుంచి 40 గజాల స్థలం కేటాయిస్తారు. దీనికి 4లక్షల రూపాయల వరకు విలువ నిర్ధారణ చేశారు. దీనికి వ్యాట్ 5 శాతం సెస్ ఒక శాతం చొప్పున 81 వేల రూపాయలు, రిజిస్ట్రేషన్ ఫీజుగా 6.5 శాతం అంటే మరో 85 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది. దీంతో ఆ ఫ్లాటుకు పన్నులు, రిజిస్ట్రేషన్ విలువ కలిపి 1.66 లక్షల రూపాయల వ్యయం అవుతుంది. తాజాగా జిఎస్‌టి 18 శాతానికి పెరిగింది. దీంతో కనీసం 3.50 లక్షల రూపాయల అదనపు వ్యయం. దీనికితోడు ఆగస్టు నుంచి ఫ్లాట్ విలువ చదరపు అడుగుకు 960 నుంచి 1,069 రూపాయల వరకు పెరిగింది. ఫలితంగా మరో 90 వేల రూపాయలు పెరిగింది. ఇలా రెండున్నర లక్షల రూపాయలకు పన్నులు పెరుగుతున్నాయ. మొత్తానికి నిర్మాణ రంగం అటు రియల్టర్లకు, ఇటు కస్టమర్లకు భారమైపోయంది.