బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీగా పెరిగిన ఐబిహెచ్‌ఎఫ్‌ఎల్ లాభం
న్యూఢిల్లీ, జూలై 24: ఐబిహెచ్‌ఎఫ్‌ఎల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 25.7 శాతం పెరిగి 788.20 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 630.10 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 3,225 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 2,597.50 కోట్ల రూపాయలుగా ఉంది.
అంబుజా సిమెంట్ లాభం
రూ. 718.24 కోట్లు
అంబుజా సిమెంట్స్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 11.85 శాతం పెరిగి 718.24 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 642.11 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక నికర అమ్మకాలు ఈసారి 7,050.11 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 6,117.36 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
12 శాతం క్షీణించిన
భారతీ ఇన్‌ఫ్రాటెల్ నికర లాభం
మొబైల్ టవర్ కంపెనీ భారతీ ఇన్‌ఫ్రాటెల్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 12 శాతం పడిపోయ 664 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 756 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 3,524 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 3,211 కోట్ల రూపాయలుగా ఉంది.
జీ ఎంటర్‌టైన్‌మెంట్
నికర లాభం రూ. 251 కోట్లు
జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 15.84 శాతం పెరిగి 251.44 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 217.04 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 1,641.31 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 1,645.03 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలియజేసింది.
31 శాతం పెరిగిన
ఐఆర్‌బి ఇన్‌ఫ్రా నికర లాభం
ఐఆర్‌బి ఇన్‌ఫ్రా ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 30.8 శాతం పెరిగి 237.8 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 181.8 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 1,870.4 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 1,548.08 కోట్ల రూపాయలుగా ఉంది.
ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్
లాభం రూ. 153 కోట్లు
ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 152.56 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 118.16 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 1,096.84 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 894.32 కోట్ల రూపాయలుగా ఉంది.
49 శాతం ఎగిసిన
జెఎమ్ ఫైనాన్షియల్ లాభం
జెఎమ్ ఫైనాన్షియల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 48.90 శాతం ఎగిసి 128.19 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇక ఆదాయం 709.09 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలియజేసింది.
ఇన్ఫో ఎడ్జ్ నికర లాభం రూ. 64 కోట్లు
ఇన్ఫో ఎడ్జ్ స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 45 శాతానికిపైగా పెరిగి 63.56 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 43.78 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 248.85 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 221.91 కోట్ల రూపాయలుగా ఉంది.