బిజినెస్

ఏప్రిల్-మేలో పెరిగిన ఎఫ్‌డిఐ: సీతారామన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి రెండు నెలల్లో (ఏప్రిల్-మే) 23 శాతం పెరిగాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 10.02 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు లోక్‌సభకు ఓ లిఖితపూర్వక సమాధానంగా మంత్రి చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం (2016-17) మొత్తంగా దేశంలోకి వచ్చిన ఎఫ్‌డిఐ విలువ 60.08 బిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం దేశ, విదేశీ మదుపరులకు స్నేహపూర్వక హస్తాన్ని అందిస్తోందని, ముఖ్యంగా విదేశీ పెట్టుబడుల విధానాన్ని సరళతరం చేశామని ఈ సందర్భంగా మంత్రి సభకు వెల్లడించారు.