బిజినెస్

ఉత్తర తెలంగాణలో ఐటి రంగానికి మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: ఉత్తర తెలంగాణలో ఐటి రంగం అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఐటి సర్వీసుల రంగం వరంగల్‌లో, బిపివోల విభాగం నిజామాబాద్, కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక ఖరారు చేసింది. ఈ ప్రణాళికను సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిపిఐ) రూపొందించింది.
వరంగల్‌లో ఎస్‌టిపిఐ సంస్థ మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో చిన్న ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. అయతే దీనిని 40 వేల చదరపు అడుగులకు విస్తరించాలని ఎస్‌టిపిఐ నిర్ణయించింది. ప్రస్తుతం ఇక్కడ 50 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంఖ్యను వచ్చే ఆరు నెలల్లో 300లకు పెంచాలని నిర్ణయించినట్లు ఎస్‌టిపిఐ డైరెక్టర్ సివిడి రాంప్రసాద్ చెప్పారు. కాగా, వరంగల్‌లో తక్కువ వ్యయంతో ఐటి కంపెనీలను ఏర్పాటు చేసేందుకు వీలుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఐటి ఉత్పత్తుల ఎగుమతుల విలువ 85 వేల కోట్ల రూపాయలకు పెరిగింది.
ఎస్‌టిపిఐ పరిధిలో ఉన్న ఐటి కంపెనీల నుంచి 46 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఎగుమతులు, ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)ల్లో ఏర్పాటు చేసిన ఐటి సంస్థల నుంచి 39 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఎగుమతులు అవుతున్నాయి. మొత్తం ఇలా 85 వేల కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరు గుతున్నాయ. మరోవైపు డిజిటల్ ఇండియా ప్రొగ్రాం క్రింద కరీంనగర్‌లో బిపివోను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రోత్సాహకాలను కూడా బిపివోలు ఏర్పాటు చేసే సంస్థలకు ప్రభుత్వం ఇస్తోంది. నిజామాబాద్‌లో బిపివోను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.