బిజినెస్

పెరిగిన అమ్మకాలతో ఎగిసిన మారుతి లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకి నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 4 శాతానికిపైగా పుంజుకుని 1,556.4 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో సంస్థ లాభం 1,490.9 కోట్ల రూపాయలుగా ఉందని మారుతి సుజుకి ఇండియా (ఎమ్‌ఎస్‌ఐ) గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక నిరుడుతో పోల్చితే నికర అమ్మకాల విలువ ఈసారి 16.7 శాతం ఎగిసి 17,132.4 కోట్ల రూపాయలుగా ఉంది. క్రిందటిసారి ఇది 14,654.5 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ ఏప్రిల్-జూన్ వ్యవధిలో మొత్తం 3,94,571 వాహనాలు అమ్ముడైయ్యాయని, అందులో 26,140 వాహనాలు విదేశీ మార్కెట్లలో అమ్మినట్లు మారుతి సుజుకి ఈ సందర్భంగా వెల్లడించింది. నిరుడు ఏప్రిల్-జూన్‌తో పోల్చితే 13.2 శాతం పెరిగాయంది. కాగా, గురువారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ ట్రేడింగ్‌లో మారుతి సుజుకి షేర్ విలువ బుధవారం ముగింపుతో పోల్చితే 0.19 శాతం పెరిగి 7,592.30 రూపాయల వద్ద స్థిరపడింది.