బిజినెస్

ఎన్‌ఎఫ్‌ఎల్ షేర్ సేల్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్)లో ప్రభుత్వ వాటా 15 శాతం విక్రయం ద్వారా ఖజానాకు దాదాపు 536 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. రెండు రోజులపాటు ఎన్‌ఎఫ్‌ఎల్ ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) కార్యక్రమం జరగగా, రెండో రోజైన గురువారం 107 కోట్ల రూపాయల విలువైన షేర్లకుగాను 178.67 కోట్ల రూపాయల విలువైన బిడ్లు రిటైల్ మదుపరుల నుంచి దాఖలయ్యాయి. బుధవారం సంస్థాగత మదుపరులకు 428.57 కోట్ల రూపాయల విలువైన షేర్లను కేటాయించగా, 578.8 కోట్ల రూపాయలు విలువైన బిడ్లు వచ్చాయి. దీంతో నిర్దేశిత లక్ష్యం 535.71 కోట్ల రూపాయల నిధులు ఖజానాకు చేరినట్లైంది.