బిజినెస్

అక్రమ బొగ్గు రవాణాకు సింగరేణి చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగుండం, మే 9: సింగరేణి పరిశ్రమ నుండి కోట్లాది రూపాయల బొగ్గు అక్రమంగా తరలి పోతుండటంతో తలలు పట్టుకుంటున్న యాజమన్యం.. బొగ్గు దందాను అరికట్టే పనిలో పడింది. బొగ్గు అక్రమ దందాతో సంస్థకు ఎదురవుతున్న నష్టాలు, వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అక్రమ బొగ్గు రవాణాను సాంకేతిక పరిజ్ఞానంతో కట్టడి చేసేందుకు సిద్ధమైంది. గ్లోబల్ ప్రొసిస్టర్ సిస్టమ్‌తో (జిపిఎస్) ద్వారా దందాను పూర్తిగా నియంత్రించాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయంచింది. ఇందులోభాగంగానే సోమవారం ఆర్జి-1 పరిధిలోగల గోదావరిఖనిలోని సింగరేణి సిఎస్‌పిలో జిపిఎస్ సిస్టమ్‌ను సిజియం సిహెచ్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. మేడిపల్లి ఓపెన్ కాస్టు ప్రాజెక్టు నుండి ఇటీవల పెద్ద బొగ్గు అక్రమంగా తరలిపోవడం, అది పట్టుబడి కేసులు నమోదవడంతో ఈ వ్యవహారంలో యాజమాన్యంపై వచ్చిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న సింగరేణి.. అక్రమ రవాణాను అరికట్టే పనిపై కసరత్తు చేసి ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై అవకతవకలకు తావివ్వకుండా బార్కోడ్ విధానం ద్వారా బొగ్గు గనుల నుండి ఏ వాహనమైనా రాకపోకల విధానం రికార్డు అవుతుంది. దీంతోపాటు బొగ్గు రవాణా జరిగే రాకపోకలపై కొత్తగా టోల్‌గేట్ తరహాలో మార్గం మధ్యలో చెక్‌పోస్టులను కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నట్లు సిజియం పేర్కొన్నారు.