బిజినెస్

దక్షిణాదిన అమ్మకాల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/న్యూఢిల్లీ, మే 9: ఈసారి అక్షయ తృతీయ అమ్మకాలు గతంతో పోల్చితే 10 శాతం పెరగవచ్చన్న ఆశాభావాన్ని నగల వర్తకులు వెలిబుచ్చారు. సోమవారం అక్షయ తృతీయ అవగా, ఈరోజు ఆభరణాల కొనుగోళ్లు శుభప్రదమనే సెంటిమెంట్ ఉన్నది తెలిసిందే. ఈ క్రమంలో ‘దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు బాగున్నాయన్న స్పందన వచ్చింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్నాయని సమాచారం అందింది. గతంతో పోల్చితే ఉత్తరాది రాష్ట్రాల మార్కెట్‌లో అమ్మకాలు స్వల్పంగా పెరుగుతాయనిపిస్తోంది. మొత్తంగా ఈ అక్షయ తృతీయ అమ్మకాలు క్రిందటిసారితో చూస్తే 5-10 శాతం పెరుగుతాయనే నమ్మకం ఉంది.’ అని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య (జిజెఎఫ్) చైర్మన్ శ్రీధర్ జివి పిటిఐకి సోమవారం తెలిపారు. పశ్చిమ భారతంలోనూ మార్కెట్ బాగుందన్న ఆయన పెళ్ళిళ్ల సీజన్ కూడా కలిసొచ్చిందన్నారు. ఎక్సైజ్ సుంకాన్ని వ్యతిరేకిస్తూ సుధీర్ఘకాలం బందైన నగల వ్యాపారం మళ్లీ ఊపందుకుందని ప్రపంచ స్వర్ణ మండలి భారతీయ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరమ్ పిఆర్ అన్నారు. అయితే నిరుడుతో పోల్చితే 25-30 శాతం అమ్మకాలు తక్కువగా జరగవచ్చని భావిస్తున్నట్లు మద్రాస్ ఆభరణాలు, వజ్రాల వ్యాపారుల సంఘం అధ్యక్షుడు జయంతిలాల్ చల్లాని అన్నారు.
ఇదిలావుంటే సోమవారం బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పుత్తడి ధర 250 రూపాయలుగా తగ్గి 30,100 రూపాయలకు చేరింది. వెండి ధర కూడా 350 రూపాయలు క్షీణించి 41,200 రూపాయలకు దిగజారింది. అంతర్జాతీయంగా సింగపూర్ మార్కెట్‌లో ఔన్సు ధర 0.7 శాతం పతనమై 1,279.80 డాలర్లుగా నమోదైంది. వెండి ధర 17.37 డాలర్లుగా ఉంది.