బిజినెస్

తునికాకు ఆదాయం ఆదివాసీలకే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 9: తునికాకు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ ఏడాది నుంచి స్థానిక ఆదివాసీల సంక్షేమానికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుండి ఆంధ్ర ప్రాంత నిర్వహణకు వచ్చిన తునికాకు సేకరణ, టెండర్ల ప్రక్రియ ఎపి ప్రభుత్వమే నిర్వహించి, ఆ వచ్చే ఆదాయాన్ని కూడా ఆయా స్థానిక ఆదివాసీలకే కేటాయించేలా మొదటిసారిగా శ్రీకారం చుట్టింది. టెండర్లు పూర్తికావడంతో తునికాకు సేకరణ మొదలవగా, ఏడు ముంపు మండలాల అటవీ ప్రాంతంలో సేకరణ జరుగుతోంది. ప్రతి వేసవి సీజన్లో తునికాకు సేకరణపై లక్షా 80 వేల మందికి ఉపాధి లభిస్తోంది. నిరుడు తునికాకు ద్వారా రూ. 4.5 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం లభించింది. అయతే ఈ ఏడాది రూ. 12 కోట్ల వరకూ ఆదాయం లభించవచ్చునని అంచనా వేస్తున్నారు. కాంట్రాక్టర్లు హెచ్చు రేట్లకు పాడుకోవడంతో మూడింతల అత్యధిక ఆదాయం లభించవచ్చని భావిస్తున్నారు. సేకరించిన తునికాకు కట్టలకు కూడా కూలి రేట్లు పెంచారు. స్టాండర్డ్ బంచ్‌లో వెయ్యి కట్టలు ఉంటాయి. దీనికి రూ. 1,290 చెల్లిస్తారు. కూలి రేట్లు, సేకరణ పెట్టుబడికి ప్రభుత్వానికి సుమారు రూ. 3 కోట్లు ఖర్చవుతోంది. ఈ వ్యయాన్ని బ్యాంకు రుణం ద్వారా సేకరించి కూలి చార్జీలకు పెట్టుబడి పెడుతున్నారు. దీనిపై వడ్డీ మినహాయించి, ఆదాయంలో ఇవన్నీ చెల్లిస్తారు. ఈ మేరకు రూ. 12 కోట్ల ఆదాయం అంచనాలో కూలి, వడ్డీ, అసలు తీర్చేయగా మిగిలే రూ. 8 కోట్ల నుండి రూ. 9 కోట్ల ఆదాయం కూడా బోనస్‌గా ప్రభుత్వం ఈ ఏడాది నుండి గిరిజన సంక్షేమానికి తిరిగి కేటాయించేస్తుందని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు రవికుమార్ ‘ఆంధ్రభూమి’కి చెప్పారు.