బిజినెస్

టెనగ చేతికి జిఎమ్‌ఆర్ ఎనర్జీ వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/న్యూఢిల్లీ, మే 9: మలేషియాకు చెందిన అతిపెద్ద విద్యుత్ రంగ సంస్థ టెనగ నేషనల్ బెర్హాద్ (టిఎన్‌బి).. జిఎమ్‌ఆర్ ఎనర్జీకి చెందిన అసెట్స్ పోర్ట్ఫోలియోలో 30 శాతం వాటాను అందుకుంది. 300 మిలియన్ డాలర్ల (దాదాపు 2,000 కోట్ల రూపాయలు)కు ఈ వాటాను టెనగ కొనుగోలు చేస్తున్నట్లు సోమవారం జిఎమ్‌ఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథి తెలిపారు. ఈ నిధులను జిఎమ్‌ఆర్ ఎనర్జీ లిమిటెడ్ (జిఇఎల్) రుణ భారాన్ని తగ్గించడానికి వినియోగిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం జిఇఎల్ నికర లాభం 2,750 కోట్ల రూపాయలుగా ఉంది.